నిర్లక్ష్యం.. తప్పదు మూల్యం

ABN , First Publish Date - 2021-04-17T06:06:37+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు పెరుగు తున్నాయి. రోజుకు సగటున 500 కు పైగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉం డాల్సి ఉన్నా.. చాలామంది నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కనీ స నిబంధనలు పాటించడం లేదు. గతంలో మాదిరిగా అధి కారులు సైతం కట్టడి చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పాఠశాలలు, సినిమాహాళ్లు, బస్సులు, ఆటోలలో ఏఒక్కరూ కోవిడ్‌ నిబంధనలు పాటించిన పాపాన పోలేదు. మాస్కులు లేకుండా ఆరుబయట సంచరిస్తున్నవారిని గుర్తించి పోలీసులు జరిమానాలు విధిస్తున్నా ప్రజల్లో ఆశించిన మేరకు మార్పు రావడం లేదు.

నిర్లక్ష్యం.. తప్పదు మూల్యం
రాజాం : బాబానగర్‌ కాలనీలో ఇతరులకు ప్రవేశం లేకుండా ఏర్పాట్లు ఇలా..

 జిల్లాలో మరో 534 కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు

 కనీస నిబంధనలు పాటించని ప్రజలు.. పట్టించుకోని అధికారులు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కరోనా కేసులు పెరుగు తున్నాయి. రోజుకు సగటున 500 కు పైగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉం డాల్సి ఉన్నా.. చాలామంది నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కనీ స నిబంధనలు పాటించడం లేదు. గతంలో మాదిరిగా అధి కారులు సైతం కట్టడి చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పాఠశాలలు, సినిమాహాళ్లు, బస్సులు, ఆటోలలో ఏఒక్కరూ కోవిడ్‌ నిబంధనలు పాటించిన పాపాన పోలేదు. మాస్కులు లేకుండా ఆరుబయట సంచరిస్తున్నవారిని గుర్తించి పోలీసులు జరిమానాలు విధిస్తున్నా ప్రజల్లో ఆశించిన మేరకు మార్పు రావడం లేదు. జిల్లాలో శ్రీకాకుళం నగరంతో పాటు రాజాం, పాలకొండ, టెక్కలి, పలాస, కాశీబుగ్గ, ఇచ్ఛాపురం వంటి పట్టణాల్లో వ్యాపార కూడళ్ల వద్ద నిత్యం జన సంచారం ఎక్కువగా ఉంటోంది. గడిచిన వారం రోజుల్లో ఒక్క శ్రీకాకుళం నగ రంలో 684 యాక్టివ్‌ కేసులున్నట్లు వైద్య బృం దాలు నిర్థారించాయి. జిల్లావ్యాప్తంగా 412 కం టైన్మెంట్‌ జోన్‌లు కొనసాగుతున్నాయి. ఓవైపు అధికారులు కరోనా కట్టడి కోసం చర్యలు చేపడుతున్నా, అవి క్షేత్రస్థాయిలో ఆచరణలోకి రావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


పెరుగుతున్న బాధితుల సంఖ్య...

జిల్లాలో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే మరో 534 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 2,650 మంది ఉన్నారు. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 50,509కి చేరింది. కరోనా పాజిటివ్‌ నిర్థారణ జరగగానే గతేడాది యంత్రాంగం ఆ వీధిలో శానిటైజేషన్‌ చేయించేవారు. ఆ వ్యక్తి ఎవరెవరితో కాంటాక్ట్‌ అయ్యారో గుర్తించి వారికి కూడా కరోనా పరీక్షలు చేసేవారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాం తాల్లో జనసంచారం లేకుండా చర్యలు చేపట్టేవారు. పోలీసు పహారా కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడా పరిస్థితి కానరావడం లేదు. ప్రజల్లో నిర్లక్ష్యధోరణి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా, బాధితుల సంఖ్య వందల సంఖ్యలో పెరిగిపోతున్నా పట్టించుకున్నవారే కరువయ్యారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిపై నిఘా లేనేలేదు.. ఇదే పరిస్థితి కొనసాగితే కొద్దిరోజుల్లోనే మహమ్మారి కాటుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వైద్యవర్గాలు హెచ్చరిస్తున్నాయి.


బాబానగర్‌లో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌

రాజాం, ఏప్రిల్‌ 16: రాజాంలోని బాబానగర్‌ కాలనీవాసులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు.  కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువవుతుండడంతో కాలనీవాసులంతా ఐక్యంగా ముందుకు వచ్చి ఇతరులెవరూ కాలనీలో ప్రవేశించకుండా రోడ్డు ప్రారంభంలో కర్రలను అడ్డుగా ఏర్పాటు చేసి కొవిడ్‌ జోన్‌ ప్లెక్సీని ఏర్పాటు చేశారు.  తొలినుంచీ కరోనా పాజిటివ్‌ కేసు లు రోజురోజుకు పెరుగుతున్నా అధికారులు ఎటు వంటి చర్యలు తీసుకోకపోవడంతో కాలనీవాసులే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. 

Updated Date - 2021-04-17T06:06:37+05:30 IST