Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం తగదు

కనిగిరి, డిసెంబరు 6: ఉద్యోగుల సంక్షేమాన్ని గాలికొదిలేసి నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్న సీఎం జగన్‌రెడ్డికి తగిన గుణపాఠం చెబుతామని ఏపీఎన్‌జీవో కనిగిరి తాలూకా నాయకులు పీవీ రమణారెడ్డి హెచ్చరించారు. స్థానిక ఏపీఎన్జీవో భవనంలో సోమవారం జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు. నేటి నుంచి 10వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలతో విధులు నిర్వహిస్తామన్నారు. 10వ తేదీ నుంచి కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. 13వ తేదీ నుంచి తాలూకా కేంద్రాలలో భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. 21 నుంచి జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌ రామచంద్రారెడ్డి, ఏపీటీఎఫ్‌ నాయకులు రాజ్‌కుమార్‌, బీటీఏ నాయకులు దద్దాల శ్రీనివాసులు, ఎస్‌టీయూ నాయకులు సైకం శ్రీను, పెన్షనర్లు, పంచాయతీరాజ్‌ ఉద్యోగుల, ప్రజా రవాణా సంస్థ, నాన్‌ గజిటెడ్‌  సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement