అరకులోయపై నిర్లక్ష్యం తగదు

ABN , First Publish Date - 2022-01-28T05:22:21+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వానికి అరకులోయపై చిన్నచూపు, నిర్లక్ష్యం తగదని టీడీపీ రాష్ట్ర ఎస్‌టీ సెల్‌ అధ్యక్షుడు సియ్యారి దొన్నుదొర అన్నారు.

అరకులోయపై నిర్లక్ష్యం తగదు
విలేకర్లతో మాట్లాడుతున్న దొన్నుదొర


తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు సియ్యారి దొన్నుదొర

అరకులోయ, జనవరి 27: రాష్ట్ర ప్రభుత్వానికి అరకులోయపై చిన్నచూపు, నిర్లక్ష్యం తగదని టీడీపీ రాష్ట్ర ఎస్‌టీ సెల్‌ అధ్యక్షుడు సియ్యారి దొన్నుదొర అన్నారు. గురువారం తన నివాసంలో తెలుగుదేశం నేతలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. పర్యాటకంగా ఎంతో ప్రాచుర్యంతోపాటు ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గ కేంద్రంగా ఉన్న అరకులోయను జిల్లాకేంద్రంగా ప్రకటించ కపోవడం అన్యాయమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అరకులోయకు ఎంతో ప్రాధాన్యనిచ్చి రూ.కోట్లతో చంద్రబాబు అభివృద్ధి చేశారన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం, వైద్య కళాశాల అరకులోయకు మంజూరు చేసినట్టు ప్రకటించి.. ఇతర ప్రాంతాలకు తరలించారన్నారు. నూతన జిల్లాల ఏర్పాటులో కూడా అన్యాయానికి గురిచేయడం సమంజసం కాదన్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరూ అరకులోయ ప్రాంతం కాకపోవడంతో వారంతా పాడేరుకు తరలిపోయినా పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆదివారం టీడీపీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అభ్యంతరాలు, నిరసనలను తెలియజేస్తామని దొన్నుదొర స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పెదలబుడు సర్పంచ్‌ పెట్టెలి దాసుబాబు, టీడీపీ నాయకులు జగన్‌, నాగరాజు, చందూ, త్రినాథ్‌, తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-01-28T05:22:21+05:30 IST