దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం : కోమటిరెడ్డి

ABN , First Publish Date - 2020-08-11T09:10:50+05:30 IST

దక్షిణ తె లంగాణ ప్రాజెక్టుల నిర్మాణంపై ప్ర భుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు.

దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం : కోమటిరెడ్డి

మునుగోడు, ఆగస్టు 10 :  దక్షిణ తె లంగాణ ప్రాజెక్టుల నిర్మాణంపై ప్ర భుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన స్థానిక పీఏసీఎస్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ సెంట్‌మెంట్‌తో సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చి ప్రాంతాల పేరుతో అసమానతలు చూపుతూ ప్రజల ఆకాంక్షలను గాలికి వదిలేశాడని విమర్శించారు.


తమకు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే చివరిదశలో ఉన్న బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టుకు నిధులు కేటాయించట్లేదన్నారు. ప్రభుత్వం అనుసరించే ప్రజావ్యతిరేక విధానాలతో పాటు వివిధ పథకాల్లో జరిగిన అవకతవకలపై ప్రజలను సమాయత్తం చేసి సమస్యల పరిష్కారానికి ఉద్యమాలను నిర్వహిస్తామన్నారు. సమావేశంలో మునుగోడు పీఏసీఎస్‌ చైర్మన్‌ కుంభం శ్రీనివా్‌సరెడ్డి, మండల అధ్యక్షుడు జాల వెంకన్నయాదవ్‌, పలువురు నాయకులు పాల్గొన్నారు.


అదేవిధంగా మునుగోడు మండలం ఇప్పర్తి గ్రామంలో తల్లిదండ్రుల మృతితో అనాథలైన ఇద్దరు పిల్లలను ఎంపీ కోమటిరెడ్డి పరామర్శించారు. బాధిత పిల్లలను అన్నికాలుగా ఆదుకుంటామని హామీనిచ్చారు. ఈ సం దర్భంగా వారికి రూ.50వేల ఆర్థిక సాయం అందించారు.  

Updated Date - 2020-08-11T09:10:50+05:30 IST