Abn logo
Sep 21 2021 @ 00:19AM

సీసీఎస్‌కు నిర్లక్ష్యపు జాఢ్యం

అప్రమత్తంగా ఉండాల్సినచోట తప్పిదాలు 

స్టేషన్‌ నుంచి పారిపోతున్న నిందితులు

రెండు నెలల వ్యవధిలో మూడు ఘటనలు


నల్లగొండ క్రైం, సెప్టెంబరు 20: ఎక్కడ ఏ నేరం జరిగినా చాకచక్యంగా వ్యవహరిం చి నిందితులను పట్టుకోవడంలో సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) పోలీసులది అందెవేసిన చేయి. అలాంటి విభాగానికి జిల్లాలో నిర్లక్ష్యపు జాఢ్యం పట్టుకుంది. పలు కేసుల్లో నిందితులైనవారిని విచారణ నిమిత్తం సీసీఎ్‌సకు అప్పగించగా, వారు పోలీ్‌సస్టేషన్‌ నుంచి పారిపోవడం సీసీఎస్‌ పోలీసుల పనితీరుకు అద్దంపడుతోంది. రెండు నెలల్లో ఇలాంటి ఘటనలు మూడు చోటుచేసుకోగా, సీసీఎస్‌ ప్రతిష్ట మసకబారుతోంది.


రెండు నెలల్లో మూడు సంఘటనలు

ఓ దొంగతనం కేసులో దొరికిన నిందితులు సీసీఎస్‌ పోలీ్‌సస్టేషన్‌ నుంచి బేడీలతో సహా పారిపోయారు. వారికి బేడీలు ఉండటాన్ని గమనించిన స్థానికులు న్యూప్రేమ్‌ థియేటర్‌ వద్ద పట్టుకుని టూటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో అప్పగించినట్లు తెలిసింది. మరో కేసులో సీసీఎస్‌ పోలీసులు అదుపులో ఉన్న నిందితుడు పారిపోయాడు. తాజాగా, ఈ నెల 18న మధ్యాహ్నం 1.30ప్రాంతంలో సీసీఎస్‌ పోలీ్‌సస్టేషన్‌ నుంచి ఇద్దరు నిందితులు పీఎస్‌ బయట ఉన్న ఐడియా షోరూం సమీపం నుంచి పరారవుతుండగా గమనించిన సిబ్బంది వారి వెంటపడి పరిగెత్తారు. వీరు ఇటీవల నకిరేకల్‌ పట్టణంలోని సాయిబాబా టెంపుల్‌, కట్టంగూర్‌, సూర్యాపేట, చిట్యాల, నార్కట్‌పల్లిలోని వేణుగోపాలస్వామి ఆలయం, రాచకొండ సీపీ పరిధిలోని చౌటుప్పల్‌తో పాటు పలు ప్రాంతాల్లోని దేవాలయాల్లో చోరీకి పాల్పడిన నిందితులు. ఈ కేసులో నకిరేకల్‌ పోలీసులు వరంగల్‌లో ఎనిమిది మందిని అరెస్టు చేసి సీసీఎ్‌సకు అప్పగించారు. అందులో ఇద్దరు నిందితులు సీసీఎస్‌ పోలీసుల కళ్లుకప్పి పారిపోవడం గమనార్హం. జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న పోలీస్‌ కార్యాలయ ఆవరణలో ఉన్న సీసీఎస్‌ పోలీ్‌సస్టేషన్‌కు ఒకే ఒక్క గేటు ఉంది. ఆ ఒక్క గేటుపై కూడా సిబ్బంది నిఘాపెట్టకపోవడం గమనార్హం.


పైరవీలు, అవసరాల కోసం పోస్టింగులు

సీసీఎస్‌ విభాగానికి యువరక్తంతో పాటు నైపుణ్యం, అనుభవం ఉన్న అధికారులు, సిబ్బందే ప్రధాన బలం. అయితే ప్రస్తుతం సీసీఎస్‌ పోలీ్‌సస్టేషన్‌లో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది ఎక్కువ శాతం మంది పైరవీలు, కుటుంబ, ఇతర అవసరాల కోసం ఇక్కడ పోస్టింగు పొందినవారే ఉన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగాక సీసీఎ్‌సలో వయస్సుపైబడిన వారు, రిమార్కులు ఉన్న వారు, అనారోగ్య సమస్యలు ఉన్న వారే అధికంగా ఉన్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఇతర ఇతర ప్రాంతాల్లో పట్టుబడిన నిందితులను తీసుకొచ్చేందుకు సరిపడా సిబ్బంది లేకపోవడంతో సీసీఎస్‌ బలహీనంగా మారింది. కష్టపడి పట్టుకొచ్చిన నిందితులు సీసీఎస్‌ నుంచి పారిపోతుండటంతో ఈ విభాగంపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.