Abn logo
Jul 13 2020 @ 13:32PM

కరోనా కిట్ల విషయంలో వెల్లువెత్తుతున్న నిర్లక్ష్యం

ప్రకాశం: జిల్లాలో కరోనా కిట్ల విషయంలో నిర్లక్ష్యం వెల్లువెత్తుతోంది. జిల్లాలో 27 వేల కరోనా టెస్టింగ్‌ కిట్ల వృథా అవగా.. రాష్ట్ర్ర వ్యాప్తంగా రెండు లక్షల కిట్ల వరకు నిరుపయోగమయ్యాయి. వివిధ ప్రాంతాల్లో సేకరించిన శ్యాంపిళ్లకు సక్రమంగా ఐడీ నంబర్లు వేసి ఆధార్‌ నంబర్‌లను క్షేత్రస్ధాయి సిబ్బంది సరిగా ఎన్‌రోల్‌ చేయలేదు. కొన్ని శ్యాంపిళ్లకు సీల్ కూడా సరిగా వేయక పోవటంతో అవి పరిక్షించిన ల్యాట్‌ టెక్నీషియన్లకు కరోనా సోకింది. ఇప్పటికే ఓ ల్యాబ్‌ టెక్నిషియన్ కరోనాతో మృతి చెందగా.. మరికొందరు చికిత్స పొందుతున్నారు. కొన్నిచోట్ల తీసిన శ్యాంపిళ్లను పరీక్షలు చేయటంలో జాప్యంతో వృథా అవుతున్నాయి.


సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వకుండా హడావుడిగా పరీక్షలు నిర్వహించటం వల్లే ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. ఎప్పుడో తీసిన శ్యాంపిళ్లకు ఇప్పటి వరకూ రిపోర్టులు రాకపోవటంతో సెల్ మెసేజ్‌ల కోసం బాధితులు ఎదురు చూస్తున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయింది. శ్యాంపిళ్లు తీయటం కన్నా ముందే ఐడీ నంబర్లు ఎంటర్ చేయటంతో.. ఆ నంబర్లు వృథా అయ్యాయి కానీ కిట్లు వృథా కాలేదని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. క్షేత్ర స్థాయిలో సిబ్బందికి సరైన శిక్షణ ఇచ్చి ఉంటే ఈ పరిస్ధితి వచ్చేది కాదంటూ జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement