Oct 27 2021 @ 15:53PM

బాబుకు పాలు ఇస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన Neha Dhupia.. నెటిజన్ల నుంచి షాకింగ్ రియాక్షన్స్..!

బాలీవుడ్ హీరోయిన్ నేహా ధూపియా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే సంగతి తెలిసిందే. `నో ఫిల్టర్ విత్ నేహ` కార్యక్రమానికి వచ్చే అతిథులను బోల్డ్ ప్రశ్నలు అడిగే నేహ.. నిజ జీవితంలో కూడా చాలా బోల్డ్‌గా ఉంటుంది. అంగద్ బేడీని వివాహం చేసుకున్న నేహ ఈ నెలలోనే తన రెండో బిడ్డకు జన్మనిచ్చింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన నేహ అతడికి పాలు ఇస్తున్న ఫొటోను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 


`ఫ్రీడమ్ టు ఫీడ్` పేరుతో ఆమె ఓ క్యాంపెయిన్‌ను నడుపుతోంది. పబ్లిక్ ప్లేస్‌ల్లో తల్లులు తమ పిల్లలకు ఎలాంటి సంకోచమూ లేకుండా పాలు ఇవ్వొచ్చనే నేపథ్యంతో నేహ ఈ క్యాంపెయిన్‌ను నడుపుతోంది. దానిని ప్రమోట్ చేసేందుకే నేహ తాజా ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోపై చాలా మంది పాజిటివ్‌గా స్పందిస్తుండగా.. కొందరు మాత్రం నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. `డియర్ నేహ.. మన దేశంలో బ్రెస్ట్ ఫీడింగ్ విషయంలో అలాంటి ఇబ్బందులు లేవు. దీనికి పబ్లిసిటీ అవసరం లేదు`, `పిల్లలకు పాలు ఇవ్వొద్దని చెప్పే వారు భారతదేశంలో ఎక్కడా ఉండరు. ప్రతిసారి పబ్లిసిటీ కోసం ఇలాంటి స్టంట్లు వద్దు` అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Bollywoodమరిన్ని...