Oct 27 2021 @ 14:33PM

తన మార్ఫింగ్ ఫొటో వైరల్ కావడంపై Neha Sharma ఏం చెప్పిందంటే..

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తొలి సినిమా `చిరుత`తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది నేహా శర్మ. ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు విజయాలు దక్కలేదు. దీంతో బాలీవుడ్‌కు వెళ్లిపోయిన నేహ అక్కడ ఛాన్సులు దక్కించుకుంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లో నటిస్తోంది. 2018లో నేహ ఫొటోను మార్ఫింగ్ చేసి దానికి అసభ్యకర బొమ్మను జోడించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ ఘటన గురించి నేహ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడింది. 


`ఆ సమయంలో నేను `ఇల్లీగ‌ల్` అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నాను. ఒక రోజు షూటింగ్ స్పాట్‌లో అందరూ నాతో విచిత్రంగా ప్రవర్తించారు. నన్ను చూసి చిన్నగా మాట్లాడుకుంటున్నారు. ఎవరూ నాతో మాట్లాడడం లేదు. ఏమైందో నాకు అర్థం కాలేదు. అప్పుడు ఒకరు నా దగ్గరికి వచ్చి ఆ మార్ఫింగ్‌ ఫోటోను చూపించారు. ఆ ఫొటో చూసి షాకయ్యాను. చాలా బాధపడ్డాను. అప్పటికింకా చాలా యంగ్‌ ఏజ్‌లో ఉన్నా. నా కెరీర్ ఏమైపోతుందోనని భయపడ్డా? అయితే నిజం ఏంటో నాకు తెలుసు. నా చుట్టూ ఉన్న వారికి తెలుసు. ఏది ఏమైనా ఇలా మార్ఫింగ్‌ చేయడం మాత్రం దారుణం` అని నేహ చెప్పింది. 

Bollywoodమరిన్ని...