Abn logo
Sep 26 2021 @ 23:50PM

యువత దేశభక్తిని పెంపొందించుకోవాలి

పిరాట్లంకలో మొక్కలు నాటుతున్న నెహ్రూ యువ కేంద్రం జాతీయ అధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి

నెహ్రూ యువకేంద్రం అధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి

రేపల్లె, సెప్టెంబరు 26: దేశస్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులను యువత ఆదర్శంగా తీసుకుని దేశభక్తిని పెంపొందించుకుని ముందుకువెళ్ళాలని నెహ్రూ యువకేంద్రం జాతీయ అధ్యక్షుడు సోముగుంట విష్ణువర్థన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రేపల్లె మండలం పిరాట్లంక గ్రామంలో నెహ్రూ యువకేంద్రం సంఘటన్‌ ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా విష్ణువర్థన్‌రెడ్డి మొక్కలు నాటారు. క్విట్‌ ఇండియా ఫ్రం రన్‌ 20లో భాగంగా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ యావత్‌ ప్రపంచదేశాల ముందు గర్వపడేలా భారతదేశాన్ని ముందుకు తీసుకువెళుతున్నారన్నారు. అమెరికా పర్యటనలో దేశఖ్యాతిని సవివరంగా చాటిచెప్పారన్నారు. భారత్‌లో 60 కోట్ల మంది యువకులు ఉన్నారని స్వాతంత్య్రం కోసం ఎన్నో కష్టాలుపడ్డ మహాత్మాగాంధీ,  సుభాస్‌చంద్రబోస్‌, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీలక్ష్మీబాయి, భగత్‌సింగ్‌ లాంటి పోరాటపటిమను యువకులు పుణికి పుచ్చుకుని రానున్న రోజులలో దేశం గర్వించేలా దూసుకుపోవాలన్నారు. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో క్విట్‌ఇండియా20 అనే కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి ప్రతి ఒక్కరూ యోగాతోపాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకునేందుకు నడకను అలవాటు చేసుకోవాలని తెలిపారు. కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్న పరిస్థితులలో ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటి వాటి సంరక్షణ స్వయంగా చూసుకోవాలన్నారు. అనంతరం జనసేన పార్టీ నాయకుల కమతం సాంబశివరావు, కమతం విజయకుమారిలు విష్ణువర్థన్‌రెడి,్డని దుశ్శాలువాలతో, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కొవిడ్‌ సమయాల్లో సేవలందించిన వైద్యసిబ్బంది, పోలీస్‌వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌వైకేఎస్‌ డైరెక్టర్‌ వీజే ప్రసన్న, ఎన్‌వైకే డిస్ర్టిక్ట్‌ యూత్‌ డైరెక్టర్‌ డి.కిరణ్మయి, శేషతల్పసాయి, చంద్రశేఖర్‌, నరేంద్ర, రాంపల్లి జగన్నాధశాసి్త్ర, బేతపూడి వెంకటేశ్వరరావు, అన్నం సాయివరప్రసాద్‌, ముత్తిరెడ్డి జయరామయ్య, వెంకటశివగోపి తదితరులు పాల్గొన్నారు.