విహాంగాల విడిది.. నేలపట్టు !

ABN , First Publish Date - 2021-02-25T04:59:52+05:30 IST

ప్రతి ఏటా లాగానే విదేశీ విహాంగాల (పక్షులు) విడిదితో నేలపట్టు సందడిగా మారింది.

విహాంగాల విడిది.. నేలపట్టు !
కడపచెట్లపై ఓపెన్‌బిల్డ్‌స్టార్క్స్‌ పక్షులు

పచ్చనిచెట్ల మధ్య కిలకిలరావాలు

అధిక సంఖ్యలో విచ్చేసిన పక్షులు

తగ్గిన సందర్శకుల సందడి 


ప్రతి ఏటా లాగానే విదేశీ విహాంగాల (పక్షులు) విడిదితో  నేలపట్టు సందడిగా మారింది. ఆనవాయితీగా అక్టోబరులో వచ్చే పక్షులు ఈ ఏడాది కూడా  అలాగే వచ్చి నవంబరు ఆఖరికి గూళ్లు కట్టాయి.  పిల్లలను పొదిగి తిరిగి మార్చి చివర,  ఏప్రిల్‌ మొదటి వారంకల్లా  వెళ్లిపోతాయి. అయితే అధిక సంఖ్యలో పక్షులు వచ్చినా సందర్శకుల తాకిడి మాత్రం చాలా వరకు తగ్గింది. 


31వేల పక్షుల విడిది 


ఈ ఏడాది వాతావరణం అనుకూలించడంతో సుమారుగా 31వేల పక్షులు విచ్చేశాయి గత ఏడాది 25వేల పక్షులు వస్తే ఈ ఏడాది వాటి సంఖ్య పెరిగింది.  ఇలా వచ్చిన వాటిలో పెలికాన్స్‌ 3,411,  లిటిల్‌ ఈగ్రేట్స్‌ 716, లార్జ్‌ ఈ గ్రేట్స్‌ 88,  క్యాటిల్‌ ఈ గ్రేట్స్‌ 412, ఓపెన్‌ బిల్డ్‌ స్టార్క్స్‌ 5,286, స్పూన్‌బిల్స్‌ 134,  స్పాట్‌బిల్స్‌ 39,. లిటిల్‌ కార్మోరెంట్స్‌ 3,315, లార్జ్‌ కార్మోరెంట్స్‌ 70,  వైట్‌ ఐబీస్‌ 4,417, డాబ్‌ చిక్స్‌ 52,  ఇండియన్‌ మోర్‌ హెరాన్స్‌ 56,  పాండ్‌ హెరాన్స్‌ 279, కూడ్స్‌ 84, నైట్‌ హెరాన్స్‌ 556, లార్జ్‌ విజిల్‌డక్స్‌ 374 రకాల పక్షులు ఉన్నాయి. అవి ప్రస్తుతం గూళ్లలో పిల్లలను పొదిగి ఉన్నవి. వాటి కిలకిలరావాలు ఎంతో మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తు న్నాయి.  పక్షుల సీజన్‌ ప్రారంభం నుంచే వాటిని వీక్షించడా నికి స్థానిక సందర్శకులతోపాటు దేశంలోని సుదూరు ప్రాం తాల నుంచి కూడా వేలసంఖ్యలో సందర్శకులు విచ్చేసివారు. అయితే ఈ ఏడాది కరోనా ప్రభావంతో సందర్శకుల రాక భారీగా తగ్గిపోయింది. కేవలం 18,500 మంది మాత్రమే ఇప్పటి వరకు నేలపట్టును సందర్శించారు.

-దొరవారిసత్రం


Updated Date - 2021-02-25T04:59:52+05:30 IST