నెల్లూరులో తమిళనాడు మద్యం పట్టివేత

ABN , First Publish Date - 2020-09-25T18:53:59+05:30 IST

జిల్లాలోని తడ మండలం పులికాట్ దీవిలోని వేనాడు గ్రామంలో సుమారు ఆరు వేల అక్రమ తమిళనాడు మద్యాన్ని సూళ్లూరుపేట సీఐ వెంకటేశ్వర్లు రెడ్డి పట్టుకున్నారు.

నెల్లూరులో తమిళనాడు మద్యం పట్టివేత

నెల్లూరు: జిల్లాలోని తడ మండలం పులికాట్ దీవిలోని వేనాడు గ్రామంలో సుమారు ఆరు వేల అక్రమ తమిళనాడు మద్యాన్ని సూళ్లూరుపేట సీఐ వెంకటేశ్వర్లు రెడ్డి పట్టుకున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మద్యాన్ని అక్రమంగా తీసుకువచ్చి ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో గత కొంతకాలంగా అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్న కొంతమందిపై సూళ్లూరుపేట పోలీసులు నిఘాపెట్టారు. ఈ క్రమంలో దాడులు నిర్వహించిన పోలీసులు వారి వద్ద నుంచి సుమారు ఆరువేల మద్యం సీసాలను సీజ్ చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Updated Date - 2020-09-25T18:53:59+05:30 IST