Advertisement
Advertisement
Abn logo
Advertisement

నెల్లూరు జిల్లాలో రాజధాని రైతులకి అష్టకష్టాలు

నెల్లూరు: మహాపాదయాత్ర చేపట్టిన రాజధాని రైతులకి జిల్లాలో అష్టకష్టాలు తప్పడంలేదు. సర్వేపల్లి నియోజకవర్గంలో బస చేసేందుకు, భోజనాలు వండుకునేందుకు కూడా స్థలాలు, కల్యాణమండపాలు లభ్యం కావడంలేదు. స్థలాలు, కళ్యాణమండపాలు ఇచ్చిన వారు కూడా తాము ఇబ్బంది పడతామని, బస చేయొద్దని వేడుకుంటున్నారు. కనీస మానవత్వం లేకుండా రాజకీయ కక్ష్య సాధింపులు కొనసాగుతున్నాయి. భోజనాల కోసం వేసిన టెంట్లను కూడా వైసీపీ శ్రేణులు తీయించేశాయి.  రైతులు రాత్రి బస కోసం ట్రాక్టర్లు, లారీల్లో నెల్లూరుకి వెనక్కి వెళ్లారు. టీడీపీ నేతలకి ముందస్తు ప్రణాళిక లేదని, తామెవ్వరికీ స్థలాలు, కళ్యాణమండపాలు ఇవ్వొద్దని చెప్పలేదని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి అంటున్నారు. 

Advertisement
Advertisement