కార్పొరేషన్‌లో పోస్టుల భర్తీకి కసరత్తు

ABN , First Publish Date - 2021-06-20T05:30:00+05:30 IST

నెల్లూరు నగర పాలక సంస్థలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్య అధికారుల కుర్చీలన్నీ ఖాళీగా ఉండటంతో పాలన గాడితప్పుతోందంటూ ‘కార్పొరేషన్‌లో ఖాళీ పాలన’ శీర్షికతో ఇటీవల ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాన్ని వెలువరించింది. దీంతో అటు యంత్రాంగం, ఇటు అధికార పార్టీ నేతలు అధికారుల నియామకంపై దృష్టి సారించారు.

కార్పొరేషన్‌లో పోస్టుల భర్తీకి కసరత్తు
కార్పొరేషన్‌ కార్యాలయం

డీసీ రేసులో పూర్వ కార్యదర్శి 

పాత మేనేజర్‌కి మళ్లీ అవకాశం....

ఏడీసీ, డీసీపీల నియామకంపై అధికారుల దృష్టి 


నెల్లూరు రూరల్‌, జూన్‌ 20 : నెల్లూరు నగర పాలక సంస్థలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్య అధికారుల కుర్చీలన్నీ ఖాళీగా ఉండటంతో పాలన గాడితప్పుతోందంటూ ‘కార్పొరేషన్‌లో ఖాళీ పాలన’ శీర్షికతో ఇటీవల ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాన్ని వెలువరించింది. దీంతో అటు యంత్రాంగం, ఇటు అధికార పార్టీ నేతలు అధికారుల నియామకంపై దృష్టి సారించారు. 

డిప్యూటీ కమిషనర్‌ పోస్టుకు సమర్ధుల కోసం ఉన్నతాధికారులు చూస్తుండగా గతంలో నెల్లూరు నగర పాలికలో కార్యదర్శిగా పనిచేస్తున్న ఓ అధికారి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆయన ప్రస్తుతం పక్క జిల్లాలోని ఓ మున్సిపాలిటీకి కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు జిల్లాకు చెందిన ఓ మంత్రి సిఫార్సు లేఖ కూడా ఇచ్చారని, త్వరలో బాధ్యతలు చేపడతారని కార్పొరేషన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ప్రస్తుతం మేనేజర్‌గా పని చేస్తున్న అధికారికి, ఉద్యోగులకు మధ్య సఖ్యత లేకపోవడంతో ఆ స్థానంలో గతంలో పని చేసిన మేనేజర్‌నే పునర్నియమించాలని ఉన్నతా ధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. 

ఇక అదనపు కమిషనర్‌, డీసీపీ పోస్టులకు పలువురు రేసులో ఉన్నారు. వీరిలో రాజకీయ పలుకుబడి ఉన్న ఒకరిద్దరి పేర్లు దాదాపుగా ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సిటీ ప్లానింగ్‌లో ఖాళీగా ఉన్న ఏసీపీ పోస్టును ఇటీవలే భర్తీ చేసిన అధికారులు ఆ విభాగంలోని టీపీఎస్‌, బీఐ పోస్టులను కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంగా కార్పొరేషన్‌లోని ముఖ్య స్థానాల్లో అధికారులందరూ త్వరలో కొలువుదీరే అవకాశాలున్నాయి.

Updated Date - 2021-06-20T05:30:00+05:30 IST