NELLORE: కూతురిపై తండ్రి లైంగికదాడి..విషయం తెలిసిన పట్టించుకోని తల్లి

ABN , First Publish Date - 2021-07-22T17:09:27+05:30 IST

జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కన్న కూతురుపై తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన వెంకటగిరి బంగారుపేట దళితవాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.

NELLORE: కూతురిపై తండ్రి లైంగికదాడి..విషయం తెలిసిన పట్టించుకోని తల్లి

నెల్లూరు: జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కన్న కూతురుపై తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన వెంకటగిరి బంగారుపేట దళితవాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..కన్న కూతురిపై కామాంధుడు తండ్రి కన్నేసాడు. ఆరు నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా కూతురు అని చూడకుండా లైంగిక దాడికి పాల్పడ్డాడు. గత వారం రోజుల నుంచి కూతురు ప్రవర్తలో మార్పులు రావడంతో తల్లి కూతురిని గట్టిగా నిలదీసింది. అసలు విషయం తల్లికి చెప్పింది. అయినా తల్లి ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోక్సో యాక్ట్ చట్టం కింద కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - 2021-07-22T17:09:27+05:30 IST