Abn logo
Jul 18 2021 @ 12:40PM

Nellore: కవల పిల్లల హత్య కేసును చేధించిన పోలీసులు

నెల్లూరు జిల్లా: ఇటీవల నెల్లూరు జిల్లాలో జరిగిన కవల పిల్లల హత్య కేసును పోలీసులు చేధించారు. కన్న తండ్రే పిల్లలకు పాలలో విషమిచ్చి చంపినట్టు పోలీసులు విచారణలో తేల్చారు. భార్య భర్తల మధ్య జరిగిన వివాదమే పిల్లల హత్యకు కారణమని విచారణలో వెల్లడయింది. నెల్లూరు జిల్లా, మనుబోలు మండలం, రాజోలుపాడులో గత నెల 20న ఈ ఘటన జరిగింది. తండ్రి వెంకట రమణయ్యని పోలీసులు అరెస్ట్ చేశారు.