Nellore: 40 ఏళ్ల వ్యక్తితో 17 ఏళ్ల బాలిక ప్రేమాయణం..అతడికి పెళ్లైన విషయం తెలిసి..

ABN , First Publish Date - 2021-08-18T17:22:43+05:30 IST

నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెంలో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేశారు. 40 ఏళ్ల వ్యక్తితో 17ఏళ్ల బాలిక కొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తోంది. 40 ఏళ్ల వ్యక్తికి పెళ్లైన విషయం అమ్మాయికి...

Nellore: 40 ఏళ్ల వ్యక్తితో 17 ఏళ్ల బాలిక ప్రేమాయణం..అతడికి పెళ్లైన విషయం తెలిసి..

నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెంలో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేశారు. 40 ఏళ్ల వ్యక్తితో 17ఏళ్ల బాలిక  కొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తోంది. 40 ఏళ్ల వ్యక్తికి పెళ్లైన విషయం అమ్మాయికి తెలియడంతో ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఆ విషయాన్ని తట్టుకోలేక బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలుసుకున్న ప్రేమికుడు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 40 ఏళ్ల వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-08-18T17:22:43+05:30 IST