నెల్లూరు జిల్లా: రాపూరు ఆర్టీసీ బస్టాండ్‌లో వింత

ABN , First Publish Date - 2021-01-20T18:21:55+05:30 IST

పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా రాపూరు ఆర్టీసీ బస్టాండ్‌లో వింత చోటు చేసుకుంది.

నెల్లూరు జిల్లా: రాపూరు ఆర్టీసీ బస్టాండ్‌లో వింత

నెల్లూరు జిల్లా: పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా రాపూరు ఆర్టీసీ బస్టాండ్‌లో వింత చోటు చేసుకుంది. రాత్రి వేళ డిపోకు చేరుకున్న బస్సులన్నింటిని ప్లాట్ ఫామ్‌లకు కొంత దూరంలో పార్కింగ్ చేశారు. అందులో ఒక బస్సు అర్ధరాత్రి సమయంలో డ్రైవర్ లేకుండానే కదులుతూ ముందుకు వచ్చింది. ప్లాట్ ఫామ్‌ వద్ద దిమ్మను ఢీకొని ఆగింది.


ఆ దృశ్యం బస్టాండ్‌లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. ఇప్పుడది వైరల్ అవుతోంది. మరోవైపు ఆర్టీసీ బస్టాండ్‌లో దెయ్యాలు తిరుగుతున్నాయంటూ కొందరు ప్రచారం మొదలుపెట్టారు. వాస్తవానికి గేర్‌వీల్స్, యోక్‌లు అరిగిపోయినప్పుడు గేర్ న్యూట్రల్ అయ్యే అవకాశం ఉందని మెకానికులు చెబుతున్నారు. పార్కింగ్ బ్రేక్ లేకపోవడం, గేర్ న్యూట్రల్ అవడంవల్లే బస్సు ముందుకు వచ్చి ఉంటుందని డ్రైవర్లు అంటున్నారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం జరగలేదు. బస్టాండ్‌లో దిమ్మను ఢీ కొనడంతో బస్సు ముందు భాగం దెబ్బతింది.

Updated Date - 2021-01-20T18:21:55+05:30 IST