Advertisement
Advertisement
Abn logo
Advertisement

నెల్లూరు జిల్లాలో తగ్గని వరద ఉధృతి..

నెల్లూరు: జిల్లాలో వరద ఉధృతి ఏ మాత్రం తగ్గలేదు. గూడూరు సమీపంలో పంబలేరు వాగు ఉప్పొంగి కోల్‌కత, చెన్నై రహదారిపై ప్రవహించింది. దీంతో  ఎక్కడికక్కడ రోడ్డు దెబ్బతింది. వాహనాల రాకపోకలు స్తంభించాయి. వాహనాలు కిలోమీటరు వెళ్లాలంటే.. 4, 5 గంటల సమయం పడుతోంది. హైవేపై 10 కి.మీ. మేర వాహనాల రాకపోకలు స్తంభించాయి.


నాయుడుపేటవద్ద జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. నెల్లూరు నుంచి గూడూరు వెళ్లేవారిని వెంకటగిరి బక్కలి రోడ్డులో వెళ్లాలని సూచించారు. అలాగే వెంకటగిరి వైపుకు కూడా వాహనాలను మళ్లించారు. దెబ్బతిన్న రోడ్డుకు తాత్కాలికంగా మరమ్మతు పనులు చేపట్టారు.

Advertisement
Advertisement