Advertisement
Advertisement
Abn logo
Advertisement

33వ రోజుకు చేరుకున్న రైతుల మహాపాదయాత్ర

నెల్లూరు జిల్లా: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రాజధాని రైతుల మహాపాదయాత్ర మహా సంగ్రామంగా సాగుతోంది. శుక్రవారం నాటికి 33వ రోజుకు చేరుకుంది. శుక్రవారం వెంకటగిరి నియోజకవర్గం తురిమెర్ల నుంచి సైదాపురం వరకు పాదయాత్ర కొనసాగనుంది. ప్రతిపక్ష పార్టీల శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి రైతులకు మద్దతు తెలుపుతున్నారు. ఇవాళ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ రానున్నారు. మరోవైపు రైతుల పాదయాత్రకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. పాదయాత్ర జరుగుతున్న ప్రాంతాల్లో ఆ పరిధి పోలీస్ స్టేషన్లలో కేసులు పెడుతున్నారు. మద్దతు తెలుపుతున్న నేతలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.

Advertisement
Advertisement