నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు.. పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు

ABN , First Publish Date - 2021-11-29T15:36:24+05:30 IST

నెల్లూరు జిల్లా: ఆత్మకూరు నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు...

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు.. పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు

నెల్లూరు జిల్లా: ఆత్మకూరు నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏఎస్ పేట మండలం, తెల్లపాడు వద్ద  కలుజువాగు ఆత్మకూరు నుంచి ఏఎస్ పేటకు రాకపోకలు నిలిచిపోయాయి. నక్కల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో  ఏఎస్ పేట నుంచి నెల్లూరు, కలిగిరికి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అనంతసాగరం చెరువు అలుగు, కొమ్మలేరు వాగులు రోడ్లపై ప్రవహించడంతో సోమశిల నుంచి ఆత్మకూరు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంగం పెన్నా వారధి వద్ద ఉధృతంగా పెన్నా నది ప్రవహిస్తోంది. దీంతో సంగం నుంచి చేజర్ల, పొదలకూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. మర్రిపాడు మండలంలోని కేతామన్నేరు వాగు రోడ్డుపై పొంగిపొర్లుతోంది. దీంతో పడమటి నాయుడు పల్లికి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. 

Updated Date - 2021-11-29T15:36:24+05:30 IST