కరోనా సేవల్లో నెల్లూరు జిల్లాకు రెండో ర్యాంకు

ABN , First Publish Date - 2020-10-18T19:44:15+05:30 IST

కరోనా బాధితులకు వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పనలో నెల్లూరు జిల్లాకు రెండో ర్యాంకు లభించింది. రాష్ట్రంలో తొలి స్థానంలో..

కరోనా సేవల్లో నెల్లూరు జిల్లాకు రెండో ర్యాంకు

నెల్లూరు: కరోనా బాధితులకు వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పనలో నెల్లూరు జిల్లాకు రెండో ర్యాంకు లభించింది. రాష్ట్రంలో తొలి స్థానంలో అనంతపురం జిల్లా నిలిచింది. 21206.07628 పాయింట్ల తో జిల్లా రెండో ర్యాంకు సాధించటంపై వైద్య వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో కరోనా చికిత్స అందించే ఎనిమిది ఆసుపత్రుల్లో ఏడు అగ్రస్థానంలో నిలి చాయి. జిల్లాలోని మెడికవర్‌ ఆసుపత్రి కరోనా సేవల్లో 2826.15 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచింది. జయభారత్‌, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, రిచ్‌, నారాయణ కావలి ఏరియా, అపోలో ఆసుపత్రులు ఆ తర్వాత స్థానంల్లో నిలిచాయి. ఇప్పటి వరకు జిల్లాలో 59,495 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 56,795 మంది కోలుకుని డిశ్చార్జిఅయ్యారు. 553 మంది మృత్యువాత పడ్డారు.


Updated Date - 2020-10-18T19:44:15+05:30 IST