Advertisement
Advertisement
Abn logo
Advertisement

నెల్లూరు కీచక్.. జీజీహెచ్ సూపరింటెండెంట్ పై లైంగిక ఆరోపణలు

నెల్లూరు : నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ ఆడియో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. కామ  వాంఛ తీర్చాలంటూ మహిళా హౌజ్ సర్జన్లు, డాక్టర్లతో పాటు మహిళా సిబ్బందిని సూపరింటెండెంట్ ప్రభాకర్ వేధిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వేధిస్తున్నాడని ఆయనపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి.  కారులో ఒంటరిగా రావాలని, తనతో ఒంటరిగా గడపాలంటూ  ప్రభాకర్ వారిని బెదిరిస్తున్నారు. దీంతో ఓ హౌజ్ సర్జన్ ఆయనను ఫోన్లో ఏకి పారేసింది. ఈ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే కొంత కాలంగా ఈ వ్యవహారం నడుస్తున్నా, బయటికి చెప్పుకోడానికి హౌజ్ సర్జన్లు, డాక్టర్లు భయపడుతున్నారు. ఈ వ్యవహారం తమ తల్లిదండ్రులకు తెలిస్తే, చదువు మాన్పించేస్తారని పలువురు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై సూపరింటెండెంట్ ప్రభాకర్‌ను వివరణ కోరదామని ఏబీఎన్ ప్రయత్నించగా, ఆయన దాటవేశారు.   


Advertisement
Advertisement