Abn logo
Sep 28 2021 @ 07:10AM

రోడ్డు పక్క నుంచి ఏవో కేకలు వినపడుతున్నాయని వెళ్లగా.. అక్కడ జరుగుతున్న సంఘటన చూసి షాకైన వాహన చోదకులు!

నెల్లూరు: వాహన చోదకులు అప్రమత్తమై చొరవ చూపడంతో వ్యభిచారం ముఠా గుట్టు రట్టయింది. మండలంలోని పుంజులూరుపాడు రైల్వే గేటు సమీపంలో కృష్ణపట్నం పోర్టు రోడ్డుకు ఆనుకున్న ప్రాంతంలో ఆదివారం రాత్రి 10.30 గంటలప్పుడు ఈ సంఘటన జరిగింది. పుంజులూరుపాడు వైపు వెళ్తున్న వాహన చోదకులకు రోడ్డు పక్క నుంచి మహిళల కేకలు పెద్దగా వినిపించాయి. దాంతో వారు వాహనాలను ఆపి పక్కన గమనించగా పదుల సంఖ్యలో లారీలను నిలిపి ఉన్నారు. వాటిని దాటుకొని వెళ్లగా ముగ్గురు మహిళలు, సుమారు ఇరవై మంది పురుషులు ఉన్నారు. ఆ మహిళలతో పురుషులు బలవంతంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం చూశారు. వెంటనే వెంకటాచలం పోలీసులకు సమాచారం అందించారు.


పోలీసులు అక్కడకు చేరుకోవడంతో నిర్వాహకుడితోపాటు విటులు అక్కడి నుంచి పరారయ్యారు. ఇద్దరు మహిళలను పోలీసులకు అప్పగించారు. నిర్వాహకుడిది వెంకటాచలం పంచాయతీలోని వడ్డిపాళెం అని తేలింది. అతను కొన్ని నెలలుగా బయట ప్రాంతాల నుంచి మహిళలను తీసుకుని వచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈఘటనపై నెల్లూరు రూరల్‌ సీఐ జగన్‌మోహన్‌రావును వివరణ కోరగా పోర్టు రోడ్డులో కొద్దిరోజులుగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. నిర్వాహకుడు పరారీలో ఉన్నాడని, అతన్ని పట్టుకుని కేసు నమోదు చేస్తామని వెల్లడించారు.