AP: సోమశిల జలాశయంలోకి 3,90,000 క్యూసెక్కుల వరద నీరు

ABN , First Publish Date - 2021-11-19T13:31:47+05:30 IST

జల్లాలో భారీ వర్షాల కారణంగా సోమశిల జలాశయానికి వరద ఉధృతి ఎక్కువగా ఉంది.

AP: సోమశిల జలాశయంలోకి 3,90,000 క్యూసెక్కుల వరద నీరు

నెల్లూరు: జల్లాలో భారీ వర్షాల కారణంగా సోమశిల జలాశయానికి వరద ఉధృతి ఎక్కువగా ఉంది. దాదాపు 3,90,000 క్యూసెక్కులకు వరద ప్రవాహం జలాశయంలోకి చేరుతోంది. దీంతో అధికారులు 11 గేట్లు నుండి 4,08,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద తాకిడికి సోమశిల ఫ్లడ్ బ్యాక్స్ దెబ్బతిన్నాయి. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో సోమశిల పరివాహక ప్రాంతాలు ప్రమాదపు అంచుల్లో ఉన్నాయి.  జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు సోమశిల జలాశయానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

Updated Date - 2021-11-19T13:31:47+05:30 IST