Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి అక్రమాలపై సుబ్బారెడ్డి ధ్వజం

నెల్లూరు: ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలపై సీనియర్ నేత చేజర్ల సుబ్బారెడ్డి, పలువురు నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రతి చిన్నపనికి ఓ రేటు కట్టి పెద్ద ఎత్తున అక్రమాలకి పాల్పడుతున్నారని సుబ్బారెడ్డి ఆరోపించారు. పార్టీ పదవులు కూడా అమ్ముకుంటూ, ఆరు నెలలకోసారి ఒక్కొక్కరిని మారుస్తున్నారని అన్నారు. వింజమూరు మండల కన్వీనర్ పదవిని ఆరు నెలల్లో ముగ్గురుకి మార్చారన్నారు. జెడ్పీటీసీ టిక్కెట్టు కోసం రూ.50 లక్షలు ఇచ్చామని తెలిపారు. ఎంపీపీ పదవులకీ ఎమ్మెల్యే రేటుకట్టి అమ్మకాలు సాగించారని విమర్శించారు. ఎనిమిది మంది దళారులని ఏర్పాటు చేసుకుని దండకాలు సాగిస్తున్నారని అన్నారు. మేకపాటి కుటుంబంలో చంద్రశేఖర్ రెడ్డి ఎలా పుట్టారా అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. జగన్ పాదయాత్ర సమయంలో పదివేల ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కనీస గౌరవం లేదని సుబ్బారెడ్డి అన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement