Abn logo
Oct 13 2021 @ 01:23AM

నేపాల్‌లో.. 980అడుగుల ఎత్తు నుంచి.. నదిలో పడిన బస్సు.. 32మంది దుర్మరణం

కఠ్మాండు, అక్టోబరు 12: నేపాల్‌లో ఒక బస్సు 982అడుగుల ఎత్తు నుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 32మంది ప్రాణాలు వదిలారు. నేపాల్‌గంజ్‌ నుంచి గాంగాధి వెళ్తున్న బస్సు ముగు జిల్లాలోని ఛయనాథ్‌ రారా మునిసిపాలిటీ పరిధిలో.. అదుపుతప్పి పీనాజ్యారీ నదిలో పడిపోయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీవ్ర గాయాలైన 15మందిని ఆస్పత్రులకు తరలించామని చెప్పారు.