Abn logo
Sep 28 2021 @ 01:52AM

25 ఏళ్ల కుర్రాడి మృతదేహం.. జేబులో దొరికిన ఓ చిన్న పుస్తకంతో వీడిన మిస్టరీ.. దేశం దాటిన యవ్వారం..!

ఒక మర్డర్ మిస్టరీ కేసు చివరికి దేశం దాటిన ప్రేమకథతో చిక్కు వీడింది. వివాహేతర సంబంధం హత్యకు దారి తీసింది. ఈ సంఘటన బీహార్‌లోని మధుబని జిల్లాలో జరిగింది. అసలేం జరిగిందంటే..


మధుబనీలోని జయానగర్‌లో ఒక గుర్తు తెలియని 25 ఏళ్ల యువకుని శవం దొరకింది. శవం పక్కనే పోలీసులకు ఒక డైరీ దొరికింది. అందులో నేపాల్ దేశానికి సంబంధించిన ఫోన్ నెంబర్ దొరికింది. ఆ ఫోన్ నెంబర్‌ని పట్టుకొని పోలీసులు ఈ హత్యకేసుని ఛేదించారు. 


పోలీసుల విచారణలో మృతుడు నేపాల్‌కు చెందిన ధుఖ్ హరణ్ మెహ్రా అని తెలిసింది. మృతుడి భార్య హరిహర్ దేవి చికిత్స నిమిత్తం బీహార్‌లోని ఒక ఆస్పత్రికి తరుచూ వచ్చేది. అక్కడ పనిచేసే ముకేశ్ యాదవ్‌తో ఆమె సన్నిహితంగా ఉండేది. వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరి ఫోన్ కాల్స్ వివరాల ప్రకారం ఆమె చాలా రాత్రులు బీహర్‌లోని సిలేబలీ ప్రాంతంలో ముకేశ్‌తో గడిపేది. ఇక వారిద్దరి ప్రేమకు అడ్డంగా మారిన భర్తను తొలగించుకోవాలనుకున్నారు.


ఒకరోజు హరిహర దేవి తన భర్తను చంపేయమని ప్రియుడు ముకేశ్‌కు 60 వేల రూపాయలు ముట్టచెప్పింది. ఆ తరువాత ముకేశ్ తన స్నేహితుడు సరోజ్‌తో కలిసి దుఖ్‌హరణ్‌ని నరికి చంపేశాడు. వారిద్దరి బండారం బయటపడడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ప్రస్తుతం హరిహర దేవి నేపాల్‌లో, ముకుశ్ యాదవ్ బీహార్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

ప్రత్యేకంమరిన్ని...