అయోధ్య‌లో మాదిరిగానే నేపాల్‌లోనూ రామ మందిరం

ABN , First Publish Date - 2020-08-09T18:13:13+05:30 IST

తమ‌ దేశంలోనూ అద్భుత‌మైన రామ మందిరం నిర్మిస్తామని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ పేర్కొన్నారు. శ్రీరాముని జన్మస్థలం నేపాల్‌లో ఉందని ఆయన గ‌తంలో వ్యాఖ్యానించారు. తప్పుడు...

అయోధ్య‌లో మాదిరిగానే నేపాల్‌లోనూ రామ మందిరం

ఖాట్మాండు: తమ‌ దేశంలోనూ అద్భుత‌మైన రామ మందిరం నిర్మిస్తామని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ పేర్కొన్నారు. శ్రీరాముని జన్మస్థలం నేపాల్‌లో ఉందని ఆయన గ‌తంలో వ్యాఖ్యానించారు. తప్పుడు వివ‌రాల‌ ఆధారంగా ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యను శ్రీ‌రాముడి జన్మస్థలంగా భారత్ చెబుతోంద‌ని ఆయ‌న ఆరోపించారు. అయితే నేపాల్ ప్ర‌ధాని ఓలీ ప్రకటనపై భారతదేశంలో ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌య్యాయి‌. రాజకీయ పార్టీలు, సామాన్య ప్రజలు కూడా నేపాల్ ప్ర‌ధాని తీరుపై నిరసన తెలిపారు. ఓలీ సొంత పార్టీ నాయకులు కూడా ఆయన ప్రకటనను వ్యతిరేకించారు. అయినప్పటికీ ప్రధాని ఓలీ ఈ విష‌యంలో మొండిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇంతేకాకుండా నేపాల్‌లోనూ అద్భుత‌మైన రామాల‌యం నిర్మించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ ఆలయ నిర్మాణానికి ఆర్థికంగా సహకరిస్తామని నేపాల్ ప్రభుత్వం త‌ర‌పున హామీ ఇచ్చారు. అయోధ్యపురితో పాటు రామాయణానికి సంబంధించిన పరిసర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామని ప్రధాని ఓలి తెలిపారు.


Updated Date - 2020-08-09T18:13:13+05:30 IST