నేపాల్‌లో 3000 దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-06-07T00:43:44+05:30 IST

సరిహద్దు దేశం నేపాల్‌లో కొత్తగా 323 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు...

నేపాల్‌లో 3000 దాటిన కరోనా కేసులు

ఖాట్మండు: సరిహద్దు దేశం నేపాల్‌లో కొత్తగా 323 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని, 32 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది. ఇదిలా ఉంటే కొత్తగా నమోదైన కేసుల్లో 286 మంది పురుషులు కాగా 37 మంది స్త్రీలని ఆరోగ్య శాఖ ప్రతినిధి వికాస్ దేవ్‌కోట వెల్లడించారు. తాజా కేసులతో కలుపుకుంటే దేశంలోని మొత్తం కేసుల సంఖ్య 3,235కు చేరగా వారిలో 3,003 మంది పురుషులు, 232 మంది స్త్రీలు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 13 మంది కరోనా కారణంగా మరణించారని, 365 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా.. 2,857 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. డిశ్చార్జ్ అయినవారిలో 299 మంది పురుషులుండగా 66 మంది స్త్రీలు ఉన్నారని వికాస్ దేవ్‌కోట వెల్లడించారు.

Updated Date - 2020-06-07T00:43:44+05:30 IST