ఆక్సిజన్ సిలిండర్ వెనక్కు తీసుకురావాలంటూ.. ఎవరెస్ట్ ఎక్కేవారికి కొత్త రిక్వెస్ట్..

ABN , First Publish Date - 2021-05-11T04:40:56+05:30 IST

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్. దీన్ని ఎక్కడానికి ఆక్సిజన్ సిలిండర్ వెంట ఉండటం తప్పనిసరి. అయితే ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఉన్న సంగతి తెలిసిందే.

ఆక్సిజన్ సిలిండర్ వెనక్కు తీసుకురావాలంటూ.. ఎవరెస్ట్ ఎక్కేవారికి కొత్త రిక్వెస్ట్..

కాఠ్మండు: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్. దీన్ని ఎక్కడానికి ఆక్సిజన్ సిలిండర్ వెంట ఉండటం తప్పనిసరి. అయితే ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఎవరెస్ట్ ఎక్కే పర్వతారోహకులకు నేపాల్ ప్రభుత్వం వింత డిమాండ్ వినిపించింది. ఎవరెస్ట్ ఎక్కే వారు తమ వెంటన తీసుకెళ్లిన ఆక్సిజన్ సిలిండర్లను కిందకు దిగే సమయంలో మళ్లీ తీసుకొని రావాలని సూచించింది. వీటిని సాధారణంగా కొండ చరియల వద్ద వదిలేస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అలా చేయొద్దని, ఖాళీ సిలిండర్లను తీసుకురావాలని అధికారులు కోరారు. ఈ కానిస్టర్లు (ఆక్సిజన్ ట్యాంకులు) తిరిగి ఆక్సిజన్‌తో నింపి, కరోనా చికిత్సకు ఉపయోగించుకుంటామని నేపాల్ ప్రభుత్వం చెప్పింది. కాగా, ఏప్రిల్-మే సీజన్‌లో ఎవరెస్ట్ ఎక్కడం కోసం 408 పర్మిట్లను నేపాల్ ప్రభుత్వం జారీ చేసింది.

Updated Date - 2021-05-11T04:40:56+05:30 IST