Abn logo
Jan 14 2021 @ 06:22AM

కాంట్రాక్టర్‌ ఇంట్లో చోరీ చేసిన నేపాలీ గ్యాంగ్‌ అరెస్టు

హైదరాబాద్/రాయదుర్గం : గత ఏడాది రాయదుర్గం పాన్‌మక్తాలో ఓ కాంట్రాక్టర్‌ ఇంట్లో యజమానులకు నిద్రమాత్రలు ఇచ్చి రూ. 33 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు దోచుకుని పారిపోయిన నేపాలి గ్యాంగ్‌ సభ్యులను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది అక్టోబర్‌ 5న మధుసూదన్‌రెడ్డి అనే కాంట్రాక్టర్‌ ఇంట్లో నేపాలీ గ్యాంగ్‌ సభ్యులు పనిమనుషులుగా చేరారు.


ఆ రోజు రాత్రి కుటుంబ సభ్యులకు భోజనంలో నిద్రమాత్రలు కలిపారు. వారు మత్తులోకి వెళ్లిన తర్వాత  బంగారు ఆభరణాలు, నగదు తీసుకొని పారిపోయారు. చోరీ జరిగిన 15 రోజులకే ఇద్దరు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్టు చేసి కొంత సొత్తు రికవరీ చేశారు. మిగతా నిందితులు నేత్ర బహదూర్‌సాహి(40), జానకి ఉదయార్‌(28), చక్రబూల్‌ అలియాస్‌ రితే‌ష్‌బూజల్‌(23), ప్రకాశ్‌సాహి, లావర్‌(25), అఖిలేష్‌కుమార్‌(25)ను బుధవారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించామని ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ తెలిపారు.  

Advertisement
Advertisement
Advertisement