నీరజ్ చోప్రా మాజీ కోచ్‌కు రూ.10 లక్షలు

ABN , First Publish Date - 2021-08-09T10:02:16+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా పసిడి పతకంతో ఫైనల్ పంచ్ ఇచ్చిన విషయం తెలిసిందే. 13ఏళ్ల నిరీక్షణకు ..

నీరజ్ చోప్రా మాజీ కోచ్‌కు రూ.10 లక్షలు

బెంగళూరు: టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా పసిడి పతకంతో ఫైనల్ పంచ్ ఇచ్చిన విషయం తెలిసిందే. 13ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ గోల్డ్ మెడల్ కొట్టి ప్రపంచ వేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించాడు. ఈ క్రమంలోనే అతడికి కోట్లకొద్దీ నగదు బహుమతులు, ఉద్యోగాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. అయితే నీరజ్‌కు మాత్రమే కాకుండా.. అతడు ఒలింపిక్స్‌ వరకు చేరేందుకు సహకరించిన కోచ్‌లకు కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభుత్వాలు కూడా వారికి బహుమానాలు అందిస్తున్నాయి. తాజాగా నీరజ్ చోప్రా మాజీ కోచ్ కాశీనాథ్ నాయక్‌కు కర్ణాటక ప్రభుత్వం రూ.10 లక్షల నజరానా ప్రకటించింది.


కర్ణాటకలోని సిర్సి ప్రాంతంలో కాశీనాయక్‌ నివశిస్తున్నాడు. కర్ణాటక రాష్ట్ర క్రీడా మంత్రి డాక్టర్ నారాయణ గౌడ దీనిపై మాట్లాడుతూ.. నాయక్ కూడా 2010లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో కాంస్య పతక విజేత అని, నీరజ్‌కు శిక్షణనిచ్చి అతడిని అంతటివారిని చేసినందుకు నాయక్‌కు కూడా గౌరవిస్తున్నామని తెలిపారు.

Updated Date - 2021-08-09T10:02:16+05:30 IST