Advertisement
Advertisement
Abn logo
Advertisement

నేరాల నియంత్రణకు కార్డెన్‌ సెర్చ్‌

గన్నవరం, నవంబరు 28: నేరాల నియంత్రణకు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నా మని ఏసీపీ విజయ్‌పాల్‌ అన్నారు. మండలంలోని కేసరపల్లి శివారు దుర్గాపురం, చెంచుల కాలనీలో ఈస్ట్‌జోన్‌ ఏసీపీ విజయ్‌పాల్‌ ఆధ్వర్యంలో ఆదివారం కార్డెన్‌సెర్చ్‌ నిర్వహించారు. గన్నవర ం పోలీసులతో పాటు కంకిపాడు, ఉయ్యూరు స్టేషన్‌లో పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌లో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి వాహనాలు, ఇంట్లో ఉండేవారి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సక్రమ మార్గంలో నడుచుకోవాలన్నారు. సీఐలు కె.శివాజీ, కాశీ విశ్వనాథ్‌, ముక్తేశ్వరరావు, ఎస్సై రమే్‌షబాబు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement