యువతకు నేతాజీ స్ఫూర్తి

ABN , First Publish Date - 2022-01-24T04:36:19+05:30 IST

స్వాతంత్ర పోరాట ఉద్యమంలో యువతకు స్ఫూర్తి నింపిన నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ అఖం డ భారతదేశానికి మరో శివాజీ అని ప్రజా వాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్‌ అన్నారు.

యువతకు నేతాజీ స్ఫూర్తి
వనపర్తిలో నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న టీజేఏఎస్‌ నాయకులు

- ప్రజా వాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్‌

- జిల్లాలో ఘనంగా సుభాష్‌చంద్రబోస్‌ జయంతి 


వనపర్తి టౌన్‌, జనవరి 23 : స్వాతంత్ర పోరాట ఉద్యమంలో యువతకు స్ఫూర్తి నింపిన నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ అఖం డ భారతదేశానికి మరో శివాజీ అని ప్రజా వాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్‌ అన్నారు. నేతాజీ సుభాష్‌చంద్ర బోస్‌ 125వ జయంతిని ఆదివారం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో టీజేఏఎస్‌ నాయ కులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజారాం ప్రకాష్‌ మాట్లాడుతూ ఆజాద్‌ హిందు ఫౌజు దళాన్ని స్థాపించి స్వాతంత్ర సంగ్రామంలో కీలక భూమిక పోషించిన దళాధిపతి నేతాజీ సుభాష్‌చం ద్రబోస్‌ అని అన్నారు. నేతాజీకి ప్రభుత్వం భారత రత్న ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో గిరిరాజా చారి, నాయికంటి నరసింహశర్మ, డాక్టర్‌ పగిడాల శ్రీనివాస్‌రెడ్డి, విభూదిఈశ్వర్‌, డప్పు నాగరాజు, కోనిం టి వెంకటేశ్వర్లు, గాయకుడు శివలింగం, కొమ్ము బాలస్వామి, మోహన్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 


 అలుపెరగని పోరాట యోధుడు..

వనపర్తి అర్బన్‌ : అలుపెరగని పోరాట యో ధుడు నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.కృష్ణ అన్నారు. ఆదివారం సు భాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతిని పురస్కరించు కొని పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన నేతాజీ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ, కార్యదర్శి పరశు రాం, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అనుజ్ఞరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మధుయాదవ్‌, పట్టణ ప్రధాన కార్యదర్శి సూగూరు రాము తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా, పట్టణంలోని వివేకానంద చౌరస్తాలో సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని భజరంగ్‌దళ్‌ ఆధ్వ ర్యంలో ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. కా ర్యక్రమంలో హిందువాహిని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొమ్ము శ్రీనివాసులు, భజరంగ్‌దళ్‌ జోగులాంబ, వన పర్తి జిల్లా విభాగ్‌ సహ ప్రముఖ్‌ శివకృష్ణ, ఆర్‌ఎస్‌ ఎస్‌ వనపర్తి నగర ప్రచారక్‌ గోలఖ్‌నాథ్‌కుమార్‌, వీహెచ్‌పీ జిల్లా ప్రధాన కార్యదర్శి వాకిటి హర్ష, సాయికిరణ్‌, రాఘవేంద్ర, రవి, సంతోష్‌, వెంకటేష్‌, శివశంకర్‌, నరేష్‌, రుద్ర, సాయి, చందు పాల్గొన్నారు. 

- వీపనగండ్ల : మండల పరిధిలోని సంగినేని పల్లిలో ఆదివారం సుభాష్‌ చంద్రబోష్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు ఇంద్రకంటి వెంకటేష్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ మౌలాలి, మాజీ సర్పంచ్‌ విజయభాస్కర్‌రెడ్డి, మాజీ ఉప సర్పంచ్‌ రామ చంద్రయ్యగౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు మీసాల మో హన్‌, కుర్మయ్య, గోవుల నాగరాజు, నారాయణ, రాజు, సత్యం, చిన్నికృష్ణ, శివకుమార్‌ తదితరులున్నారు.

- పెబ్బేరు : పెబ్బేరు పట్టణంలో నేతాజీ సు భాష్‌ చంద్రబోస్‌ 129వ జయంతి వేడుకల్ని ఆదివా రం ఘనంగా నిర్వహించారు. పలు పార్టీల నాయకు లతో పాటు, సుభాష్‌ యూత్‌, ఆజాద్‌ యూత్‌, గ్రామ యువకులు స్థానిక సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహం వద్ద ఆయన జయంతి వేడుకలను నిర్వహించారు. 

- కొత్తకోట : మండలంలో స్వాతంత్య్ర ఉద్యమ నాయకుడు సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కొత్తకోట, కని మెట్ట గ్రామాల్లో చంద్రబోస్‌ చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కనిమెట్టలో సర్పంచ్‌ గాధంరాణి, పరుమేష్‌, పరుశ రాం, సురేష్‌కుమార్‌యాదవ్‌, కొత్తకోటలో కౌన్సిలర్లు అయ్యన్న, ఖాజామైనొద్దీన్‌, నాయకులు సత్యం యాదవ్‌, సుభాష్‌, ఇజ్రాయిల్‌, వికాస్‌, మహేష్‌, ష కీల్‌, కిరణ్‌, జేమ్స్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

- అమరచింత : నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ 125వ జయంతిని ఆదివారం అమరచింతలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని గాంధీ విగ్రహానికి ఎదురుగా ఉన్న ఓం కట్ట వద్ద నేతాజీ చిత్రపటానికి ఏబీవీపీ జిల్లా నాయకులు వినోద్‌కుమార్‌, భరత్‌కుమార్‌లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతాజీ సేవ లను కొనియాడారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయ కులు ఉట్కూరు మహేష్‌, కె.రాజేష్‌, అఖిల్‌, రాజేష్‌, శ్రీరాం సాయిచంద్రు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు క్యామ భాస్కర్‌, నరాల సిద్దు, జగన్నాథం తదితరులు పాల్గొ న్నారు. 

- శ్రీరంగాపూర్‌ : మండల కేంద్రంలో మత్స్యకార సహకార సంఘంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా నేతాజీ చిత్రపటానికి సంఘం నాయకులు పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సం ఘం అధ్యక్షుడు నరసింహ, ఉపాధ్యక్షుడు విష్ణు, కార్యదర్శి అంజి, నాయకులు కర్రెన్న, వెంకటయ్య, యాదగిరి, శరత్‌కుమార్‌, నరేష్‌, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.  



Updated Date - 2022-01-24T04:36:19+05:30 IST