నేతాజీ సేవలు మరువలేనివి

ABN , First Publish Date - 2022-01-24T05:08:03+05:30 IST

నేతాజీ సేవలు మరువలేనివి

నేతాజీ సేవలు మరువలేనివి
కీసర రూరల్‌ : సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న బీజేపీ మేడ్చల్‌ రూరల్‌ జిల్లా అధ్యక్షుడు విక్రంరెడ్డి

కీసర రూరల్‌/ఘట్‌కేసర్‌ రూరల్‌/ఘట్‌కేసర్‌/పరిగి/దోమ/ కులకచర్ల/ తాండూరు/ బంట్వారం (కోట్‌పల్లి) జనవరి 23 :   స్వాతంత్య్ర సాధన కోసం పాటుపడిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ సేవలు మరువలేనివని పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఆదివారం బోస్‌ జయంతి సందర్భంగా నాగారం మున్సిపాలిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన బోస్‌ విగ్రహాన్ని బీజేపీ మేడ్చల్‌ రూరల్‌ జిల్లా అధ్యక్షుడు విక్రంరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆజాద్‌ హిందూ ఫౌజ్‌ను స్థాపించిన ధీరుడు సుభాష్‌ చంద్రబోస్‌ అని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాగారం మున్సిపాలిటీ అధ్యక్షుడు మొసలి కేశవరెడ్డి, నాయకులు సురేష్‌, కందాడి సత్తిరెడ్డి, రవీందర్‌, సూర్యశేఖర్‌రెడ్డి, జూపల్లి నరేష్‌, సురేష్‌, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఘట్‌కేసర్‌ మండలంలోని ఎదులాబాద్‌, ఘణాపూర్‌, కొర్రెములలో ఆదివారం నేతాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఘణాపూర్‌లో జరిగిన నేతాజీ జయంతి వేడుకల్లో సర్పంచ్‌ బద్దం గోపాల్‌రెడ్డి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ నేతాజీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు వేముల మహే్‌షగౌడ్‌, నానావత్‌ సురే్‌షనాయక్‌, పరమే్‌షగౌడ్‌, అభిషేక్‌, ఎస్‌ఐ ధనంజయ్య, భానుచందర్‌, ప్రణయ్‌, సామల అమర్‌, కాలేరు రామోజీ, బట్టె లక్ష్మణ్‌, ఎంకే నాగరాజు, అముద రాము, విజయ్‌, నాని తదితరులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం నేతాజీ చేసిన కృషి మరువలేనిదని పోచారం మున్సిపల్‌ చైర్మన్‌ బోయపల్లి కొండల్‌రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడలో బోస్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్‌ నానావత్‌ రెడ్డియానాయక్‌, కో-ఆప్షన్‌ సభ్యుడు అక్రం అలీ, నాయకులు రాజేశ్వర్‌ రెడ్డి, ప్రశాంత్‌, గోవింద్‌, రాఘవేందర్‌రెడ్డి, శ్రీధర్‌, లక్ష్మణ్‌, ప్రణీత్‌రెడ్డి, విక్రమ్‌, జైపాల్‌రెడ్డి, శేఖర్‌, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పరిగి సబ్‌ డివిజన్‌ పరిధిలో పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో నేతాజీ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. పరిగిలో  నేతాజీ విగ్రహానికి  నాయకులు పూలమాలలువేసి నివాళులర్పించారు. పరిగి మునిసిపల్‌ చైర్మన్‌ ఎం.అశోక్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి మాట్లాడుతూ నేతాజీ చిన్నప్పటి నుంచీ చురుకైన వ్యక్తియని, పాఠశాల, కళాశాల విద్యలో ఎప్పుడు ప్రథముడుగా నిలిచేవాడని పేర్కొన్నాడు. చెరసాలనే స్వగృహంగా, కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, లండన్‌, జపాన్‌, జర్మనీ తదితర దేశాలకు వెళ్ళి స్వాతంత్య్ర సాధనకు మద్దతు కూడగట్టి, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ అనే సైన్యాన్ని స్థాపించిన గొప్ప మహానీయుడని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు బి.ప్రవీణ్‌రెడ్డి, ఆర్‌.ఆంజనేయులు, ఎస్‌పి బాబయ్య, పెంటయ్య, కె.శ్రీశైలం, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. దోమ మండల కేంద్రంలో పలువురు యువకులు నేతాజీ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. దేశానికి బోస్‌ చేసిన సేవలు ప్రజలు ఏనాటికీ మరువలేరని కొనియాడారు. కార్యక్రమంలో మహేశ్‌, శ్రీనివాస్‌, శివప్రసాద్‌, నవీన్‌కుమార్‌, పండరీనాథ్‌, సాయి, వెంకటేశ్‌, నరేశ్‌, శ్రీనివాస్‌, చంద్రకాంత్‌, నరేశ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.  అలాగే చౌడాపూర్‌ మండల కేంద్రంలో బోస్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. చౌరస్తాలో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటుచేసి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శంకర్‌, యువజన సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని శాంత్‌మహల్‌ చౌక్‌లో నేతాజీ విగ్రహానికి టీజేఎస్‌ కౌన్సిలర్‌ సోంశేఖర్‌, బీసీ సంఘం తాండూరు నియోజకవర్గ కన్వీనర్‌ రాజ్‌కుమార్‌, నేతాజీ యువజన సంఘం ప్రతినిధులు తదితరులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం, యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ స్వాతంత్య్ర సమరయోధుల అడుగు జాడల్లో నడవాలని కోట్‌పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఉప్పరి మహేందర్‌ యువతకు పిలుపునిచ్చారు. కోట్‌పల్లిలో శ్రీనివాస్‌గుప్త ఆధ్వర్యంలో బోస్‌ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కోట్‌పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఉప్పరి మహేందర్‌, సీనియర్‌ నాయకులు మల్లేషం, పాండు, అమర్‌నాథ్‌, లాలప్ప, మోసిన్‌, యువ నాయకులు నాగేష్‌, రాఘవరెడ్డి, మహేష్‌కుమార్‌, నాగప్ప, వెంకటేషం, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T05:08:03+05:30 IST