నేతాజీని యువత స్ఫూర్తిగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-01-24T05:58:19+05:30 IST

దేశ చరిత్రలో మరిచిపోలేని వీరుడు సుభాష్‌ చంద్రబోస్‌ అని, యువత నేతాజీని స్ఫూర్తిగా తీసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు.

నేతాజీని యువత స్ఫూర్తిగా తీసుకోవాలి
నేతాజీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే చందర్‌

- రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ 

కళ్యాణ్‌నగర్‌, జనవరి 23: దేశ చరిత్రలో మరిచిపోలేని వీరుడు సుభాష్‌ చంద్రబోస్‌ అని, యువత నేతాజీని స్ఫూర్తిగా తీసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో నేతాజీ సాగించిన పోరాటం యువత కు స్ఫూర్తిదాయకమని, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ స్థాపించి యువతను స్వాతంత్య్ర ఉద్యమంలో భాగస్వామ్యం చేశారని, నేతాజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ బంగి అనీల్‌ కుమార్‌, డిప్యూటీ మేయర్‌ నడిపెల్లి అభిషేక్‌రావు, నాయకులు తోడేటి శంకర్‌గౌడ్‌, మెతుకు దేవరాజ్‌, ముక్కెర రాజే శం, నారాయణదాసు మారుతి, గుంపుల ఓదెలు, జేవీ రాజు, మద్దెల శ్రీని వాస్‌, బెంద్రం నాగభూషణం, సీత పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T05:58:19+05:30 IST