వారాంతాల్లో ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌!

ABN , First Publish Date - 2020-10-24T06:52:03+05:30 IST

నెట్‌ఫ్లిక్స్‌ భారతదేశ వినియోగదారులపై కన్నేసింది. అందులో భాగంగా వారాంతాల్లో నెట్‌ఫ్లిక్స్‌ అందించే ప్రోగ్రామ్స్‌ను ఉచితంగా చూసే అవకాశం కల్పించనుంది...

వారాంతాల్లో ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌!

నెట్‌ఫ్లిక్స్‌ భారతదేశ వినియోగదారులపై కన్నేసింది. అందులో భాగంగా వారాంతాల్లో నెట్‌ఫ్లిక్స్‌ అందించే ప్రోగ్రామ్స్‌ను ఉచితంగా చూసే అవకాశం కల్పించనుంది. ఈ విషయాన్ని కంపెనీ చీఫ్‌ ప్రొడక్ట్‌ అధికారి అనధికారికంగా వెల్లడించారు. అయితే ఈ సౌలభ్యం ఎప్పటినుంచి అన్నది మాత్రం తెలియటం లేదు. ఇదే సమయంలో అమెరికాలో ప్రస్తుతం అందిస్తున్న మొదటి నెల ఉచితం ఆఫర్‌ను రద్దు చేయనున్నారు. అలాగే నెట్‌ఫ్లిక్స్‌ యుఐ ఇకపై హిందీలో అందుబాటులో ఉంచింది. ఈ ఏడాది మే నెలలో ఒక ఆఫర్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. హయ్యర్‌ గ్రేడ్‌ ప్లాన్‌లోకి  వెళ్ళే వినియోగదారులకు ఒక నెల ఫ్రీగా ఇచ్చింది. రూ.199 మొబైల్‌ ప్లాన్‌ను మన దేశంలో పరిచయం చేసిన సంగతి తెలిసిందే. భారత వినియోగదారుల మనసు చూరగొనేందుకు త్వరలో అందించే వీకెండ్‌ ఫ్రీఆఫర్‌ ఏ మేరకు కంపెనీ అంచనాలను అందుకుంటుందో చూడాలి.  


Updated Date - 2020-10-24T06:52:03+05:30 IST