అస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై మరో దేశం నిషేధాస్త్రం

ABN , First Publish Date - 2021-03-15T13:06:52+05:30 IST

ఆస్ట్రాజెనెకా టీకాను నిషేధించిన దేశాల్లో మరో దేశం చేరింది....

అస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై మరో దేశం నిషేధాస్త్రం

మాస్కో :  ఆస్ట్రాజెనెకా టీకాను నిషేధించిన దేశాల్లో మరో దేశం చేరింది. అస్ట్రాజెనెకా టీకా తీసుకున్న తర్వాత రక్తం గడ్డకడుతున్న కేసులు పెరుగుతుండడంతో తాజాగా నెదర్లాండు నిషేధాస్త్రం విధించింది. ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న వారిలో తీవ్రమైన రక్తస్రావం, రక్తం గడ్డకట్టడం, బ్లడ్ ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోతుందని తేలడంతో నెదర్లాండు దేశంలో దీన్ని నిషేధిస్తూ డచ్ మెడిసిన్స్ ఎవాల్యూషన్ బోర్డు నిర్ణయం తీసుకుంది. మార్చి 28వతేదీ వరకు రెండు వారాల పాటు అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ను వినియోగించవద్దంటూ నెదర్లాండ్ ప్రభుత్వం ఆదేశించింది. ఆదివారం డెన్మార్క్, నార్వే, ఆస్ట్రియా, ఎస్టోనియా, లిథువేనియా, థాయిలాండ్, ఐస్‌లాండ్ దేశాలు ఆస్ట్రాజెనెకా టీకాను నిషేధించాయి. మరోవైపు, ఆస్ట్రాజెనెకా టీకాను నిషేధిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), యూరోనియన్ మెడిసిన్స్ ఏజెన్సీ మాత్రం ఈ టీకాతో ఎలాంటి ప్రమాదం లేదని, బోల్డన్ని ఉపయోగాలు ఉన్నాయని చెబుతున్నాయి.


Updated Date - 2021-03-15T13:06:52+05:30 IST