Advertisement

దివాళీ ఫొటోలో Ranbir Kapoorను కౌగిలించుకున్న alia bhatt.. నెటిజన్లు ఏమన్నారంటే..

దీపావళి పండగను బాలీవుడ్ సెలబ్రిటీలందరూ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. తమ వేడుకల ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. బాలీవుడ్ ప్రేమజంట రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ కూడా దీపావళిని బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ సందర్భంగా తీసుకున్న ఫొటోను ఆలియా భట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో రణ్‌బీర్, ఆలియా ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకుంటూ కౌగలించుకుని ఉన్నారు. 


`కొంత ప్రేమ, దీపావళి` అంటూ ఆలియా షేర్ చేసిన ఆ ఫొటో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ ఫొటోపై లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది. `ఇప్పటికే పెళ్లి చేసుకున్నట్టు ఉన్నారు`, `మీ కోసం ఓ ప్రపంచం సృష్టిస్తాను`, `త్వరగా పెళ్లి చేసుకోండి` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా ఈ ఫొటోపై స్పందించారు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, జోయా అక్తర్ ఈ ఫొటోకు హార్ట్ ఎమోజీలు జత చేశారు.  

Advertisement

Bollywoodమరిన్ని...