Oct 23 2021 @ 15:24PM

పిల్లలు పూర్తిగా దుస్తులు ధరించారు..తల్లి మాత్రం ధరించలేదంటూ బాలీవుడ్ స్టార్ హీరో భార్యని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

సోషల్ మీడియా యుగంలో ట్రోలింగ్ అనేది ఎక్కువైపోయింది. అలియా భట్, కరీనా కపూర్, ఇషాగుప్తాల ట్రోలింగ్‌ను మరచిపోకముందే మరొకరు నెటిజన్ల ట్రోలింగ్‌కు గురయ్యారు. ఈ సారి బాలీవుడ్ స్టార్ హీరో భార్య ఈ ట్రోలింగ్‌కు బాధితురాలైంది. 


కబీర్ సింగ్ చిత్రంలో నటించి 200కోట్ల క్లబ్‌లోకి చేరిన నటుడు షాహిద్ కపూర్. ఆయన కుటుంబంతో సహా మాల్లీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్లాడు. ఈ ట్రిప్‌ను ముగించుకుని కొన్ని రోజుల అనంతరం ఇండియాకు వచ్చాడు. ముంబై ఎయిర్ పోర్టులో వారు దిగగానే షాహిద్ పూర్తిగా దుస్తులు ధరించి బ్లాక్ గాగూల్స్‌తో కనిపించగా, అతడి భార్య మిరా రాజ్‌పుత్ బ్లాక్ డెనిమ్ షార్ట్స్‌తో కనిపించింది. బాలీవుడ్ వెబ్‌సైట్‌లు కొన్ని వీరు ముంబైకి చేరుకున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాయి. దీంతో ఆ వీడియో నెట్టింట్లో విపరీతంగా వైరల్ అయింది. 


వైరల్ అయిన వీడియో కింద నెటిజన్లు భారీ స్థాయిలో నెగెటివ్ కామెంట్స్ పోస్ట్ చేశారు. ‘‘ పిల్లలు పూర్తిగా దుస్తులు ధరించారు. తల్లి మాత్రం ధరించలేదు ’’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ‘‘ పురుషుల పట్ల నాకు రోజురోజుకు గౌరవం పెరగుతోంది. ఎందుకంటే వారు ప్రజా సముదాయాల్లో పూర్తిగా దుస్తులు వేసుకుంటున్నారు’’ అని మరొ నెటిజన్ కామెంట్ పోస్ట్ చేశారు. ‘‘ ఆమె ఎంత చిన్న షార్ట్స్ వేసుకుంది. అసలు వేసుకుందా అనే సందేహం నాకు వస్తోంది ’’ అని సోషల్ మీడియా యూజర్ తన స్పందనను తెలిపారు.