కొవిషీల్డ్‌తో 11 మందిలో నాడీ రుగ్మతలు

ABN , First Publish Date - 2021-06-23T10:03:15+05:30 IST

భారత్‌, బ్రిటన్‌లలో కొవిషీల్డ్‌ టీకా తీసుకున్న 11 మందిలో ‘గ్విలేన్‌ బరీ సిండ్రోమ్‌’ (జీబీఎస్‌) అనే నాడీ వ్యవస్థకు సంబంధించిన రుగ్మతను గుర్తించారు

కొవిషీల్డ్‌తో 11 మందిలో నాడీ రుగ్మతలు

అధ్యయన నివేదికల్లో వెల్లడి


న్యూఢిల్లీ, జూన్‌ 22 : భారత్‌, బ్రిటన్‌లలో కొవిషీల్డ్‌ టీకా తీసుకున్న 11 మందిలో ‘గ్విలేన్‌ బరీ సిండ్రోమ్‌’ (జీబీఎస్‌) అనే నాడీ వ్యవస్థకు సంబంధించిన రుగ్మతను గుర్తించారు. వీటిలో ఏడు కేసులు కేరళలోని ఓ ఆస్పత్రిలో గుర్తించగా, మరో నాలుగు కేసులు బ్రిటన్‌లోని నాటింగ్‌హమ్‌ నగరంలో బయటపడ్డాయి. వ్యాక్సిన్‌ వేయించుకున్న దాదాపు 10 నుంచి 22 రోజుల తర్వాత ఈ దుష్ప్రభావం తలెత్తిందని పేర్కొంటూ రూపొందించిన రెండు వేర్వేరు అధ్యయన నివేదికలు ‘అనల్స్‌ ఆఫ్‌ న్యూరాలజీ’ జర్నల్‌లో జూన్‌ 10న ప్రచురితమయ్యాయి. జీబీఎస్‌ బారినపడే వారిలో రోగ నిరోధక వ్యవస్థ అదుపు తప్పి ప్రవర్తిస్తుంది. పొరపాటున అది మనిషి నాడీ వ్యవస్థపైనే దాడికి పాల్పడుతుందని వైద్య నిపుణులు తెలిపారు.

Updated Date - 2021-06-23T10:03:15+05:30 IST