ధోనీ ఉండగా ఫీల్డింగ్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు: కుల్దీప్

ABN , First Publish Date - 2020-07-05T02:15:25+05:30 IST

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ధోనీ ఉండగా ఫీల్డింగ్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు: కుల్దీప్

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జట్టును విజయం వైపు నడిపించడంలో ధోనీకంటే గొప్ప సారధి ఉండడని చాలామంది క్రికెట్ ప్రియుల అభిప్రాయం. తనది కూడా అదే అభిప్రాయమని భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెప్పాడు. అందుకే వికెట్ల వెనుక ధోనీ ఉండగా ఎప్పుడూ ఫీల్డ్ సెటప్ గురించి తాను ఆలోచించలేదన్నాడు. ‘బ్యాట్స్‌మెన్ నేను వేసే బంతులను ఎలా ఆడతాడో ధోనీకి బాగా తెలుసు. దానికి తగ్గట్లు ధోనీయే ఫీల్డింగ్ సెటప్ చేస్తాడు. అప్పుడప్పుడు ఎటువైపు బంతిని తిప్పాలో, ఏ లెంగ్త్‌లో విసరాలో కూడా చెప్తుంటాడు’ అని కుల్దీప్ చెప్పాడు. ధోనీ ఉండగా తాను ఇప్పటి వరకూ ఎప్పుడూ ఫీల్డ్ సెటప్ గురించి కనీసం ఆలోచించలేదని వెల్లడించాడు.

Updated Date - 2020-07-05T02:15:25+05:30 IST