Abn logo
Sep 27 2021 @ 19:19PM

10 రెట్లు రక్షణనిచ్చే 3D వ్యాక్సీన్ ప్యాచ్

న్యూఢిల్లీ: కొవిడ్-19కు పెద్ద మొత్తంలో చెక్ పెట్టే విధంగా శాస్త్రవేత్తలు త్రీడీ ప్రింటెడ్ ప్యాచ్‌ను కనుగొన్నారు. ఇది సాధారణ షాట్ కంటే పది రెట్లు ఎక్కువ రక్షణ ఇస్తుందని వారు పేర్కొన్నారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కాలిఫోర్నియా‌లకు చెందిన శాస్త్రవేత్తలు దీనిని అభివృద్ధి చేశారు. ఈ 3 డి-ప్రింటెడ్ ప్యాచ్.. మైక్రోనెడిల్స్‌ను పాలిమర్ ప్యాచ్‌పై వరుసలో ఉంచుతుంది. చాలా పొడవుగా ఉండటం వల్ల చర్మం లోపలికి వ్యాక్సిన్ సులువుగా చేరుకుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.


‘‘ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ను మరింత పటిష్టం, మరింత సమర్ధవంతం చేసేందుకు మా ఈ ప్రయోగం ఉపకరిస్తుంది. తక్కువ మోతాదులో నొప్పి, ఆందోళన లేని పద్దతిలో టీకా తీసుకోవడంతో పాటు టీకాల వేగవంతానికి ఎంతగానో తోడ్పతుతుందని ఆశిస్తున్నాం’’ స్టాన్‌ఫోర్డ్ యూనిర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జోసెఫ్ ఎం డెసిమొనె తెలిపారు. ‘‘మా విధానం మైక్రోనేడిల్స్‌ను నేరుగా 3డి ప్రింట్ చేయడానికి అనుమతిస్తుంది. పనితీరుతో పాటు ఖర్చు నుండి ఉత్తమ మైక్రోనెడిల్స్ తయారు చేయడానికి ఈ డిజైన్ ఉపయోగపడుతుంది’’ అని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కాలిఫోర్నియా‌కు చెందిన రీసెర్చర్ షోమిన్ టియాన్ తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption