‘సర్‌ప్లస్‌’ సంకటం

ABN , First Publish Date - 2020-10-25T15:28:58+05:30 IST

టీచర్ల రేషనలైజేషన్‌ ఉత్తర్వుల ప్రభావం జిల్లాలో తీవ్రంగా ఉండే..

‘సర్‌ప్లస్‌’ సంకటం

75 శాతం కొత్త అడ్మిషన్ల షరతు ప్రభావం


ఏలూరు: టీచర్ల రేషనలైజేషన్‌ ఉత్తర్వుల ప్రభావం జిల్లాలో తీవ్రంగా ఉండే సంకేతాలు వస్తున్నాయి.  పాఠశాలల్లో ఈ ఏడా ది ఫిబ్రవరి 29వ తేదీ నాటి విద్యార్థుల రోల్‌ ప్రకారమే రేషనలై జేషన్‌ ప్రక్రియను తొలుత చేప ట్టారు. ఆ తరువాత నుంచి అక్టోబరు 14వ తేదీ వరకూ ఏ స్కూల్‌లోనైనా విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ అదనంగా 75 శాతం పెరిగి ఉంటే మిగులు (సర్‌ప్లస్‌) టీచర్లను మినహాయిం చేందుకు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులు జిల్లాలో పెద్దగా ప్రయోజనం ఇచ్చే అవకాశాల్లేవు. ఆ ప్రకారం జిల్లా విద్యాశాఖ తొలుత రూపొందించిన 1357 మంది సర్‌ప్లస్‌, 1044 మంది డిఫిసిట్‌ (లోటు) టీచర్ల సంఖ్యలో స్వల్ప మార్పులు మాత్రమే చోటు చేసుకోనున్నాయి. గత విద్యా సంవత్సరం నాటి విద్యార్థుల రోల్‌ కంటే ఈ ఏడాది అక్టోబరు 14వ తేదీ నాటికి విద్యార్థుల ఎన్‌ రోల్‌మెంట్‌ అత్యధిక పాఠశాలల్లో 20 నుంచి 25 శాతానికి మించకపోకవడమే దీనికి కారణమని తెలుస్తోంది.


ఆ మేరకు పాఠశాలల వారీగా పెరిగిన విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను ఎంఈవోల నుంచి సేకరించిన జిల్లా విద్యాశాఖ వాటిని పరిశీలన, తుది ఆమోదం నిమిత్తం కలెక్టర్‌కు ఆదివారం అందజేయ నుంది. కొత్తగా 75 శాతం అడ్మిషన్లు అదనంగా జరిగిన పాఠశాలలు దాదాపు ఉండకపోవచ్చని చెబుతున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 965 మంది ఎస్‌ జీటీలు సర్‌ప్లస్‌ జాబితాలో ఉండగా, ఆ మేరకు ప్రాథమిక విద్యకు విఘాతం ఏర్పడుతుందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక కొత్తగా ఈ ఏడాది ఒకటో తరగతి లో కి సుమారు 34 వేల మంది చిన్నారుల అడ్మిషన్లు  జరిగినా, ఇవి గత ఏడా ది రోల్‌తో పోల్చితే స్వల్ప పెరుగుదలే తప్ప పెద్దగా ప్రభావం చూపబోదని తెలుస్తోంది. 


Updated Date - 2020-10-25T15:28:58+05:30 IST