‘నాచు’ మాస్క్‌.. 99.3% ఫలితం

ABN , First Publish Date - 2020-05-30T12:43:04+05:30 IST

ఇది ‘నాచు’ మాస్క్‌. పేరు ‘ఆక్సిజనో’. దీన్ని పంజాబ్‌లోని ఎల్‌పీ వర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు.

‘నాచు’ మాస్క్‌.. 99.3% ఫలితం

న్యూఢిల్లీ, మే 29: ఇది ‘నాచు’ మాస్క్‌. పేరు ‘ఆక్సిజనో’. దీన్ని పంజాబ్‌లోని ఎల్‌పీ వర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఎన్‌95 మాస్క్‌ కంటే మెరుగ్గా పనిచేయగలదని వారు వెల్లడించారు. పీల్చుకునే గాలిని 99.3% శుద్ధి చేయడంతోపాటు కరోనా వైరస్‌ సహా కనిష్ఠంగా 0.44 మైక్రోమీటర్ల పరిమాణం ఉండే కాలుష్య కారకాలనూ అడ్డుకోగలదని తెలిపారు. ఈ మాస్క్‌కు నాలుగు లేయర్లు ఉంటాయి. పైపొరలో ఉండే నాచులోని సూక్ష్మక్రిములు కిరణజన్య సంయోగ క్రియను నిర్వహించి కర్బన ఉద్గారాలను తరిమేస్తాయి. ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసి.. శ్వాస తీసుకునేందుకు మరింత అనువుగా మాస్క్‌ను మారుస్తాయి. 

Updated Date - 2020-05-30T12:43:04+05:30 IST