కొత్త కేసులు 8,218

ABN , First Publish Date - 2020-09-20T09:00:27+05:30 IST

కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రతిరోజూ 8వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం 74,595 మందికి పరీక్షలు నిర్వహించగా 8,218 మందికి వైరస్‌ నిర్ధారణ అయిందని ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది.

కొత్త కేసులు 8,218

  • మరో 58 మంది బలి
  • మొత్తం పాజిటివ్‌లు 6.17 లక్షలు 
  • 5,302కు చేరిన కరోనా మరణాలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రతిరోజూ 8వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం 74,595 మందికి పరీక్షలు నిర్వహించగా 8,218 మందికి వైరస్‌ నిర్ధారణ అయిందని ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌లు 6,17,776కు చేరాయి. తాజాగా మరో 10,820 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ 5,30,711 మంది డిశ్చార్జి అయ్యారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకూ 58మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. చిత్తూరులో 9మంది, కృష్ణాలో ఏడుగురు, అనంతపురం, గుంటూరు, కడప, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో నలుగురు చొప్పున, తూర్పుగోదావరి, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, విజయనగరంలో ఒక్కరు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 5,302కు పెరిగాయి. 


బెజవాడలో రోడ్డెక్కిన సిటీ బస్సులు

సుదీర్ఘ లాక్‌డౌన్‌ అనంతరం విజయవాడ నగరంలో శనివారం సిటీ బస్సులు మళ్లీ రోడ్డెక్కాయి.  తొలి రోజున మొత్తం 125 బస్సులను బయటకు తీశారు. అయితే.. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పెద్దగా ఆదరణ లేదు. తర్వాత క్రమేపీ ప్రయాణికులు బస్సులెక్కడం ప్రారంభించారు. సాయంత్రానికి 40 శాతం ఆక్యుపెన్సీ నమోదైనట్లు ఆర్టీసీ కృష్ణా ఆర్‌ఎం చెప్పారు. 

Updated Date - 2020-09-20T09:00:27+05:30 IST