మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా

ABN , First Publish Date - 2020-08-05T09:14:54+05:30 IST

రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. వైరస్‌ బారిన పడుతున్న ప్రజాప్రతినిధుల జాబితా నానాటికీ పెరుగుతోంది. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యుత్‌, అటవీశాఖ మంత్రి బాలినేని

మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలకు  కరోనా

  • కరోనా హైదరాబాద్‌ అపోలోలో బాలినేనికి చికిత్స 
  • కరణం బలరాం, ఆయన కుమారుడికి కొవిడ్‌ 
  • అన్నా రాంబాబు దంపతులకు వ్యాధి నిర్ధారణ 
  • 25 వేలకు చేరువలో ‘తూర్పు’ 
  • హైదరాబాద్‌ అపోలోలో బాలినేనికి చికిత్స 
  • రాష్ట్రంలో కొత్త కేసులు 9747 
  • మరణాలు 67
  • మొత్తం పాజిటివ్‌లు 176333 

  • (ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. వైరస్‌ బారిన పడుతున్న ప్రజాప్రతినిధుల జాబితా నానాటికీ పెరుగుతోంది. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యుత్‌, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారం రోజుల నుంచి స్వల్ప జ్వరం ఉండటంతో ఆయన హైదరాబాద్‌లో పరీక్షలు చేయించుకున్నారు. తొలుత నెగెటివ్‌ రాగా, మంగళవారం సాయంత్రం పరీక్షల్లో వైరస్‌ సోకినట్లు తేలింది. వెంటనే ఆయన చికిత్స కోసం అక్కడి అపోలో ఆస్పత్రిలో చేరారు. అలాగే కరోనా బారిన పడిన చీరాల శాసనసభ్యుడు కరణం బలరాం హైదరాబాద్‌లోని స్టార్‌ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటుండగా, ఆయన కుమారుడు కరణం వెంకటేశ్‌కు కూడా పాజిటివ్‌ రావడంతో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో పాటు ఆయన భార్యకు కూడా వైరస్‌ ఉన్నట్లు తేలడంతో ఒంగోలులోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. 


95,625 మంది డిశ్చార్జ్‌

సోమవారం 64,147 మందికి వైద్యపరీక్షలు నిర్వహించగా 9,747మందికి కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు ఆరోగ్యశాఖ మంగళవారం బులెటిన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌లు 1,76,333కు చేరుకున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం కేసులు 24,685కు పెరిగాయి. 


కుమారుడికి పాజిటివ్‌..కుప్పకూలిన తండ్రి

నెల్లిమర్ల: తండ్రీ కొడుకులు ఇద్దరూ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కుమారుడి(32)కి పాజిటివ్‌ రాగా... తండ్రి(58)కి నెగెటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని కుమారుడు చెప్తుండగా.. ఆందోళనతో తండ్రిగుండె ఆగింది. ఈ ఘటన విజయనగరంజిల్లా నెల్లిమర్ల మండలంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. 

Updated Date - 2020-08-05T09:14:54+05:30 IST