నయా కలెక్టరేట్‌ అదుర్స్‌..

ABN , First Publish Date - 2021-06-20T05:40:38+05:30 IST

ఇరుకిరుకు గదులు... చీకటి గుయ్యారాలు... పెచ్చులూడే పైకప్పులు.. బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తించే ఉద్యోగులు.. ఇది ఒకప్పటి వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్‌ పరిస్థితి. సకల సౌకర్యాలు.. విశాలమైన గదులు... ఆధునిక హంగులు... ధారాళమైన గాలీవెలుతురు... చుట్టూరా అందమైన హరితవనం.. అన్ని శాఖల ఉద్యోగులకు అనువైన వాతావరణం.. ఇది నేటి వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్‌ పరిస్థితి.

నయా కలెక్టరేట్‌ అదుర్స్‌..

రేపు సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం
సర్వాంగ సుందరంగా ముస్తాబైన నూతన భవన సముదాయం
ఆకట్టుకుంటున్న నిర్మాణం.. ఆధునిక హంగులు
సకల సౌకర్యాలు.. చుట్టూరా హరితవనం..
ఒకేచోట ఉండనున్న అన్ని ప్రధాన శాఖలు
మంత్రి చాంబర్‌ కూడా ఇక్కడే..



ఇరుకిరుకు గదులు... చీకటి గుయ్యారాలు... పెచ్చులూడే పైకప్పులు.. బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తించే ఉద్యోగులు..  ఇది ఒకప్పటి వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్‌ పరిస్థితి.

సకల సౌకర్యాలు.. విశాలమైన గదులు... ఆధునిక హంగులు... ధారాళమైన గాలీవెలుతురు... చుట్టూరా అందమైన హరితవనం.. అన్ని శాఖల ఉద్యోగులకు అనువైన వాతావరణం..  ఇది నేటి వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్‌ పరిస్థితి.




వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్‌

వరంగల్‌ అర్బన్‌ నూతన కలెక్టరేట్‌ నూతన భవన సముదాయం ప్రారంభానికి సిద్ధమైంది. సీఎం కేసీఆర్‌ సోమవారం ఈ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.  సుబేదారిలోని పాత కలెక్టరేట్‌లోని భవనాలను పూర్తిగా కూల్చివేసి  ‘సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం’ (ఇంటిగ్రేటెడ్‌ డిస్ర్టిక్ట్‌ ఆఫీసెస్‌ కాంప్లెక్స్‌) పేరుతో నూతన భవనాన్ని నిర్మించారు.

ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తెచ్చేందుకు నూతన జిల్లాలు ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభు త్వం.. సమీకృత కలెక్టరేట్‌ భవనాల ఏర్పాటుతో అధికారులందరూ ఒకే చోట అందుబాటులో ఉండేలా చర్య లు చేపట్టిన విషయం విదితమే. వివిధ  ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే బాధితులు ఒకేచోట అన్ని పనులు ముగించుకుని సాయంత్రానికి ఇంటికి చేరేలా చేయడమే సమీకృత భవనాల ఉద్దేశం.  ప్రతీ జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణాలు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా ఒకే ప్రణాళికతో ముందడుగు వేసింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ముందుగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టరేట్‌ భవన నిర్మాణం తలపెట్టారు.  6.73 ఎకరాల సువిశాలమైన  స్థలంలో రూ.57కోట్ల అంచనా వ్యయంతో అధునాతన సాంకేతికతతో సర్వాంగ సుందరంగా కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ నిర్మించారు.  సోమవారం (21వ తేదీ) రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ భవనం అందరినీ ఆకర్షిస్తోంది.

జీ ప్లస్‌ టూ అంతస్తులతో నిర్మించిన ఈ భవనం లో సుమారు 34 శాఖలు ఒకేచోట కొలువు తీరనున్నా యి. 50 మంది కూర్చునేలా వీడియో కాన్ఫరెన్స్‌ హాలు, 210  మంది కూర్చునేలా సమావేశ మందిరం నిర్మించారు. 24 మంది కూర్చునేలా మినీ కాన్ఫరెన్స్‌హాలు ఉన్నాయి. మొదటి అంతస్తులో 13శాఖలతో పాటు మంత్రికి ప్రత్యేక చాంబర్‌ కేటాయించారు. రెండో అంతస్థులో 15 డిపార్ట్‌మెంట్లతో పాటు 31 మంది కూర ్చునేలా సమావేశ మందిరం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న సిబ్బందికి అనుగుణంగా కలెక్టరేట్‌లో స్థలం కేటాయించారు. ఒక్కో శాఖలో ఎంత మంది సిబ్బంది ఉన్నారు...? ఎన్ని గదులు కావాలని  సమాచారం సేకరించారు. సేకరించిన సమాచారం ఆధారంగానే గదులు కేటాయించారు.

గ్రౌండ్‌ ఫ్లోర్‌లో కలెక్టర్‌ ఛాంబర్‌

సమీకృత కలెక్టరేట్‌ భవనంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో కలెక్టర్‌, రెవెన్యూకు సంబంధించిన విభాగాలు ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ చాంబర్‌, అదనపు కలెక్టర్‌ చాంబర్‌, టూరిజం అధికారి, ఐసీడీఎస్‌, స మావేశ మందిరం, వేచిఉండు గది, మహిళలకు లంచ్‌ రూమ్‌, సర్వర్‌ రూమ్‌, వీడియో కాన్ఫరెన్స్‌ రూమ్‌, స్టాఫ్‌ రూమ్‌, రికార్డు గది, కలెక్టరేట్‌ ఇన్‌/ఔట్‌ వా ర్డు, రేడియో ఇంజనీరు కార్యాలయం, ఇతర సిబ్బంది గదులు ఉన్నాయి.

మొదటి అంతస్థులో మంత్రి ఛాంబర్‌

జీ ప్లస్‌ టూ ఉన్న కలెక్టరేట్‌లో మొదటి అంతస్తులో జిల్లా మంత్రికి చాంబర్‌ను కేటాయించారు. దీంతోపాటు ఖజాన, టీ ఫైబర్‌, పౌరసరఫరాల శాఖ, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డుల శాఖ, చేనేత, ఉపాధి కల్పనాధికారి, ఆడిట్‌, మినీ కాన్ఫరెన్స్‌ హాలు, డీపీఆర్వో శాఖలకు గదులు కేటాయించారు.

మూడో అంతస్థులో సంక్షేమ శాఖలు
జిల్లా సంక్షేమ శాఖలకు మూడో అంతస్తు కేటాయించారు. డీఆర్‌డీవో, ఎస్సీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు, వ్యవసాయ శాఖ, ఉద్యానవ, పట్టుపరిశ్రమ, డీపీవో, ఎల్‌డీఎం, భూ గర్భజల శాఖ, ఎక్సైజ్‌, సహకార డీపీవో, గనుల శాఖలకు అవసరమైన గదులు కేటాయించారు.  

పార్కింగ్‌కు స్టిల్ట్‌ ఫ్లోర్‌

సువిశాలమైన  కలెక్టరేట్‌ భవనంలో వచ్చే వాహనాల కోసం ప్రత్యేకంగా స్టిల్ట్‌ ఫ్లోర్‌ ఏర్పాటు చేశారు. వాహనాలు నేరుగా గ్రౌండ్‌ ఫ్లోర్‌ కంటే కింద ఉన్న స్టిల్ట్‌ ఫ్లోర్‌కు వెళ్ళి పార్కింగ్‌ చేయాల్సి ఉంటుంది. ముందుగా అనుకున్న ప్లానింగ్‌కు పార్కింగ్‌ స్థలాన్ని రూ.5కోట్లతో అదనంగా నిర్మించారు.

మంత్రులకు ప్రత్యేక చాంబర్‌

అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మంత్రికి ప్రత్యేక చాంబర్‌ కేటాయించారు. అధికారులతో సమావేశం ఏర్పాటు, ప్రజా సమస్యల తెలుసుకునేందుకు వీలుగా ప్రత్యేక ఛాంబర్‌ను ఏర్పాటు చేశారు.  

ప్రత్యేక ఆకర్షణగా..
నగరం నడిబొడ్డున నిర్మితమైన వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్‌ భవనం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. సువిశాలమైన  భవనాలు, కాంప్లెక్స్‌ ముందు ప్రత్యేక  గార్డెన్‌, జాతీయ జెండా, కాకతీయుత కళాతోరణం వంటివి చూపరులను ఇట్టే ఆకర్షిస్థాయి. సర్వాంగ సుందరంగా ఆధునిక హంగులతో నిర్మితమైన  నూతన కలెక్టరేట్‌ భవనం వరంగల్‌ కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలువనుంది.

ఫొటో ఫ్లీజ్‌
కలెక్టరేట్‌ నూతన భవనం రంగురంగుల విద్యుదీపాల నడుమ జిగేల్‌మంటోంది. దీంతో ప్రజలు కలెక్టరేట్‌ ముందు నిలబడి ఫొటోలు దిగేందుకు ఎగబడుతున్నారు. ఫ్యామిలీ ఫొటోలతో పాటు సెల్ఫీలు తీసుకొని కలెక్టరేట్‌ అందాలను తమ సెల్‌ఫోన్లలో బంధిస్తున్నారు. ప్రారంభానికి ముందే కలెక్టరేట్‌ వద్ద సందడి మొదలైంది.















Updated Date - 2021-06-20T05:40:38+05:30 IST