కొత్తసాగుపై..నిరసనలు..ప్రతినలు

ABN , First Publish Date - 2020-05-29T10:34:46+05:30 IST

నియంత్రిత పంటల సాగుకు మద్దతుగా కొన్ని చోట్ల రైతులు ప్రతిజ్ఞలు చేస్తే మరికొన్ని చోట్ల నిరసనలు కూడా మొదలయ్యాయి

కొత్తసాగుపై..నిరసనలు..ప్రతినలు

జిల్లాలో నియంత్రిత సాగు లక్ష్యం 2,50,220 ఎకరాలు

నియంత్రిత సాగువద్దని రైతుల తీర్మానం


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

నియంత్రిత పంటల సాగుకు మద్దతుగా కొన్ని చోట్ల రైతులు ప్రతిజ్ఞలు చేస్తే మరికొన్ని చోట్ల నిరసనలు కూడా మొదలయ్యాయి.  వానాకాలం పంటల్లో నియంత్రిత సాగుపై గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నియంత్రిత సాగులక్ష్యం 2,50,220 ఎకరాలుగా పెట్టుకున్నారు. ఈ సారి మొక్కజొన్న పంటను వేయవద్దని ఆంక్షలు విధించారు. దీంతో వరి, పత్తిసాగు పెంచుకోవడానికి రైతులు సన్నద్ధం అయ్యారు. గోదావరి జలాలతో మిడ్‌ మానేరు ప్రాజెక్టుతో పాటు చెరువుల్లోకి నీరుచేరడం భూగర్భ జలాలు పెరగడంతో రైతులు నియంత్రిత సాగువైపు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు గురువారం ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో రైతు అవగా హన సదస్సులో రైతులు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. నియంత్రిత సాగువిధానం వద్దంటు రైతులు వ్యతిరేకించడం చర్చనీయాంశంగా మారింది.


దీనిబాటనే మరికొన్ని గ్రామాల్లో కూడా వ్యతిరేక తీర్మానం చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు నియంత్రిత సాగులో వరి 1.10 లక్షలు ఎకరాలు, పత్తి 1.30 లక్షల ఎకరాలు, కందులు 8వేల ఎకరాలు, పెసర 1000 ఎకరాలు, మినుములు 150 ఎకరాలు, సోయబీన్‌ 25 ఎకరాలు, చెరకు 150 ఎకరాలు, జొన్న 80 ఎకరాలు, ఇతర పంటలు 815 ఎకరాలు సాగుకు సిద్ధమయ్యారు. నియంత్రిత పంటల సాగువిధానం ఎలా ఉండబోతుందనే ఆసక్తి మొదలైంది. 


మిడుతలదాడిపై రైతుల్లో ఆందోళన

వానాకాలం పంటలకు రైతులు సన్నద్ధం అయ్యారు. వానాకాలం పం టలపై దృష్టిపెట్టిన పంటలకు మిడుతల దాడిభయం పట్టుకుంది. మ హారాష్ట్రలోకి ప్రవేశించిన మిడుతలు సరిహద్దు జిల్లాల నుంచి మండ లాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరా ధి రాష్ట్రాలలో మిడుతలు శరవేగంగా వస్తుండగా వానాకాలం సీజన్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మిడుతల దండును ఎదుర్కోవడానికి కూడా వ్యవసా య అధికారులు అప్రమత్తమయ్యారు. వివిధ రకాల రసాయనాలు సిద్ధం చేయడంతో పాటు రైతులకు అవగాహన కల్పించడానికి అప్రమత్తమయ్యారు. 

Updated Date - 2020-05-29T10:34:46+05:30 IST