Abn logo
Sep 25 2021 @ 01:26AM

నూతన సాగుచట్టాలను రద్దుచేయాలి

నల్లగొండలో ప్రజాసంఘాలసమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు శంకర్‌

27న భారత్‌బంద్‌కు ప్రజాసంఘాల పిలుపు

నల్లగొండ క్రైం/ మునుగోడు/ డిండి/ నకిరేకల్‌/ చిట్యాల/వేములపల్లి/ మాడ్గులపల్లి/ కేతేపల్లి/ మిర్యాలగూడ, సెప్టెంబరు 24:  నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఈనెల 27న నిర్వహించనున్న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని వివిధ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక దొడ్డి కొమరయ్య భవన్‌లో నిర్వహించిన సమావేశంలో  పీడీఎ్‌సయూ రాష్ట్ర నాయకుడు ఇందూరి సాగర్‌, ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు శంకర్‌, ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ, టీఎ్‌సయూ జిల్లా అధ్యక్షుడు కొండేటి మురళి మాట్లాడారు.  విద్యా సంస్థల బంద్‌కు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రావణ్‌, రాంబాబు, అజయ్‌, సుకుమార్‌, సిద్దార్థ, అశోక్‌, నవీన్‌, రమేష్‌, జమీర్‌ ఉన్నారు.  కేంద్ర ప్రభుత్వం అమలు చేసే రైతు వ్యతిరేక నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బీజేపీయేతర 19పార్టీలు కలిసి ఈనెల 27న నిర్వహించ తలపెట్టిన భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం కోరారు. మునుగోడులోని సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి సురిగి చలపతి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బొల్గూరి నర్సింహ, వెంకటేశ్వర్లు, శ్రీను పాల్గొన్నారు. డిండిలో సీపీఐ రాష్ట్ర  కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి మాట్లాడారు. నకిరేకల్‌లో పీసీపీ కార్యనిర్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్‌ మాట్లాడారు. భారత్‌బంద్‌ సన్నాహక కార్యక్రమంలో భాగంగా అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో  పట్టణంలోని అన్ని బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాయి కృష్ణ, పన్నాల రాఘవరెడ్డి, యానాల కృష్ణారెడ్డి, యూసుఫ్‌, వెంకటయ్య  పాల్గొన్నారు. చిట్యాలలో కాంగ్రెస్‌, వామపక్షాలు, టీడీపీ నాయకులు భారత్‌బంద్‌పై సమావేశం నిర్వహించారు. సమావేశంలో నాయకులు పోకల దేవదాస్‌, గుడిపాటి లక్ష్మినర్సింహ, జడల చినమల్లయ్య, జిట్ట నగేష్‌, అవిశెట్టి శంకరయ్య, శీలా రాజయ్య, సుదర్శన్‌, అరూరి సత్తయ్య, అక్బర్‌, లింగయ్య పాలొన్నారు. వేములపల్లిలో ఎంపీపీ పుట్టల సునీతతోపాటు కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, టీజేఎస్‌ నాయకులతో కలిసి బంద్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. మాడ్గులపల్లిలో రైతుసంఘం నాయకులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి మాట్లాడారు. బంద్‌కు అన్నివర్గాల ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రొండి శ్రీనివాస్‌, నాయకులు శ్రీకర్‌, అశోక్‌రెడ్డి, మల్లారెడ్డి, పవన్‌, నవీన్‌ పాల్గొన్నారు. కేతేపల్లిలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో  వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బొజ్జ చినవెంకులు మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్పొరేట్‌ శక్తులకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. సమావేశంలో కాగ్రెస్‌ నాయకుడు జె.వెంకటనర్సయ్యయాదవ్‌, సీపీఎం నాయకులు లూర్దు మారయ్య, ఏళ్ల అశోక్‌రెడ్డి, ఆశీర్వాదం, పుల్లయ్య, మీనయ్య పాల్గొన్నారు. మిర్యాలగూడలో డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భారత్‌బంద్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీవైఎ్‌ఫఐ నాయకులు అంజద్‌, శ్రీను, బాబునాయక్‌, నాగేందర్‌, బిక్షం, పారూఖ్‌, వదూద్‌, నాగరాజు, పవన్‌, స్టాలిన్‌, తరుణ్‌ పాల్గొన్నారు.